Asianet News TeluguAsianet News Telugu

మండిపడుతున్న విజయశాంతి... ఆ హాట్ కామెంట్స్ మెగాస్టార్ చిరజీవిపైనేనా...?

విజయశాంతి మండిపడుతున్నారు.. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాపై విరుచుకుపడ్డారు.. పనిలో పనిగా ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్ పై కూడా కస్సుమన్నారు.. హాట్ కామెంట్స్ చేశారు.. ఇంతకీ విజయశాంతి విమర్షించింది మెగాస్టార్ చిరంజీవినేనా..? 

Vijayashanthi Hot Comments about Laal Singh Chaddha and Megastar
Author
Hyderabad, First Published Aug 3, 2022, 10:47 AM IST

బాలీవుడ్ హీరోలందరిలో అమీర్ ఖాన్ ది స్పెషల్ ఇమేజ్. ఆయన్ను అందరూ  మిస్టర్ పర్ఫెక్ట్ అంటుంటారు. ఇక ఆయన సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఆడియన్స్ మెచ్చేవిగా ఉంటాయి. ఇక చాలా కాలం గ్యాప్ తరువాత  ఆమిర్ ఖాన్ నటిస్తూ.. నిర్మించిన సినిమా లాల్ సింగ్ చడ్డా.  హాలీవుడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమపై తాజాగా  దేశమంతా వ్యాతిరేకత వ్యాక్తం అవుతుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ లు వెలుస్తున్న వేళ.. ఈసినిమాపై బీజేపీకి చెందిన నాయకులు వ్యాతిరేకంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై, ఆమిర్ ఖాన్‌పై లేడీ సూపర్ స్టార్,  విజయశాంతి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ  ప్రభుత్వంపై.. వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ... 2015లో ఆమిర్ ఖాన్ చేసిన  అసహన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఆయన అలా మాట్లాడబట్టే.. ఇప్పుడు అమీర్ ఆఫలితాన్ని అనుభవిస్తున్నట్లుగా విజయశాంతి అభిప్రాయ పడ్డారు.  ఈ సందర్భంగా సౌత్ హీరోలపై కూడా ఆమె మండిపడ్డారు. ఈ సినిమా విషయంలో జనం ఆలోచించినంత సరిగా మన సౌత్ హీరోలు ఆలోచించలేకపోతున్నారన్నారు. ఈ సినిమాపై వ్యాతిరేకతను సౌత్ హీరోలు కొందరు పట్టించుకోకుండా ఆయన సినిమాని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారామె. అయితే విజయశాంతి ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్ధ్యేశించి అన్నారా అన్న అనుమానం కలుగుతుంది. 

లాల్ సింగ్ చడ్డా సినిమాకు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ గా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ లోచురుగ్గాపాల్గోంటున్నారు. అంతే కాదు అమీర్ ను ఆకాశానికి ఎత్తి పొగిడారు.. అంతే కాదు ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండగా .. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాములమ్మ వ్యాఖ్యలు చిరంజీవిపైనే.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు ఒక సారి ఆలోచించాల్సిందిగా.. రాములమ్మ హిత బోధ చేశారు.  అయితే ఈసినిమాలో నాగార్జున పెద్ద కుమారుడు.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈసినిమా విషయంలో నాగార్జున కూడా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గోంటున్నారు. 

 

 

జనాల్ని అమాయకులు అనుకుని  నోటికొచ్చినట్టు మాట్లాడితే... ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్‌గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని... ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమిర్ అన్నారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో... ఇప్పటికీ పొందుతున్నారో... చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు... ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమిర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు.

 

భారత్ ను అవమానించి.. నోటికొచ్చినట్టు మాట్లాడి..  ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా అనే ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్... గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారు. దురదృష్టమేంటంటే.. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు .. అమీర్ సినిమాను ప్రమోడ్ చేయడం తగదు అంటూ విజయశాంతి పోస్ట్  పెట్టారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios