Asianet News TeluguAsianet News Telugu

సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ ‘లైగర్’.. రన్ టైం డిటేయిల్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘లైగర్’ (Liger). తాజాగా ఈ చిత్రం సెన్సార్ ను పూర్తి చేస్తుంది. అలాగే రన్ టైం కూడా హెచ్చుతగ్గులు  లేకుండా ఉంది. 
 

Vijay Deverakondas Liger Movie has completed its censoring, Run time details
Author
Hyderabad, First Published Aug 5, 2022, 5:29 PM IST

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇది. ఇప్పటికీ రెండేండ్లుగా విజయ్ సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాగే ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాలు రాలేదు.. ఆ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్న తర్వాత మళ్లీ ‘లైగర్’ను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు దర్శకుడు పూరీ జగన్నాథ్. 

ఇప్పటికే క్రేజీ అప్డేట్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్న మేకర్స్ తాజాగా మరో న్యూస్ ను అందించారు. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో లైగర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. మరో చిత్రం రన్ టైం కూడా హెచ్చుతగ్గులు లేకుండా 2 గంటల 20 నిమిషాల నిడివి ఉంది. ఇలా ఒక్కో వర్క్ ను కంప్లీట్ చేస్తూ చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే  విజయ్ దేవరకొండ - అనన్య పాండే (Ananya Panday) సినిమాను క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన  పోస్టర్స్, గ్లింప్ష్, ట్రైలర్, పాటలకు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

రెండేండ్లుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గురించి విజయ్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేశాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా సరికొత్త సబ్జెక్ట్ తో ఫ్రెష్ లోకేషన్స్ ను, ఎలిమెంట్స్ ను ఆడియెన్స్ నచ్చేలా సినిమాలో చిత్రీకరించారు. ఆగస్టు 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగ, హిందీలో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్  రిలీజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందనే లభిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios