విజయ్ దేవరకొండ రీసెంట్ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అవటంతో ఆచి,తూచి అడుగులు వేయాల్సిన  పరిస్దితి వచ్చింది. తన దగ్గరకు వచ్చే కథలే కాకుండా తనే కొన్ని కథలను వెతుక్కుంటూ వెళ్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. ఈ క్రమంలో ఆయన రెండు ప్రాజెక్టులు ఓకే చేసారని చెప్తున్నారు. ఆ డైరక్టర్స్ ని  తనే స్వయంగా పిలిచి, కథలు చెప్పమని, ఓకే చేసాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరక్టర్స్ ఎవరూ అంటారా..

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తికాగానే తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదవుతుంది. ఈ నేపథ్యంలో ఆ తరువాత సినిమాను విజయ్ దేవరకొండ ఏ దర్శకుడితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే విజయ్ దేవరకొండకి చాలామంది యువ దర్శకులు కథలను వినిపించి వున్నారు. అయితే అవి తన బాడీ లాంగ్వేజ్ కు అణుగుణంగా రాసుకొచ్చిన కథలని, అవి రొటీన్ గా అనిపించాయిట. దాంతో ఈ మధ్యకాలంలోతనకు నచ్చిన దర్శకులు ఇద్దరు సినిమాలు పిక్ చేసి, వాళ్లను పిలిచారట. వాళ్లు మరెవరో కాదు శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ.

నిన్ను కోరి, మజిలి చిత్రాలతో తనకంటూ స్టైల్ క్రియేట్ చేసుకున్న శివ నిర్వాణ..ఇప్పుడు నానితో టక్ జగదీష్ చేస్తున్నారు. అలాగే మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలు డైరక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ కూడా ఓ డిఫరెంట్ స్టైల్ ఫిల్మ్ మేకర్. వీళ్లిద్దరి మేకింగ్, కథ చెప్పే విధానం నచ్చి..విజయ్ దేవరకొండ వాళ్లని పిలిచి తనకో సినిమా చేయమని అడిగాడని చెప్పుకుంటున్నారు.  

వాళ్లు చెప్పిన కథలలో కాస్త భిన్నంగా అనిపించిన కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సినిమాలకు సంభందించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి ఈ కథ పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. మొదట శివనిర్వాణ చిత్రం ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చిత్రం ఉంటుందని చెప్తున్నారు.