Asianet News TeluguAsianet News Telugu

స్టడీగా హిందీ లైగర్ కలెక్షన్స్... బ్రేక్ ఈవెన్ కి చేరువలో!


హిందీలో లైగర్ పర్వాలేదనిపిస్తుంది. అక్కడ ఈ చిత్రం స్వల్ప లాభాలు రాబట్టే సూచనలు కలవు. మూడో రోజు ఆదివారం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. 
 

vijay devarakonda liger hindi collections going study
Author
First Published Aug 29, 2022, 2:28 PM IST

లైగర్ హిందీ వర్షన్ ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసి తప్పుచేశారనిపిస్తుంది. ఆగస్టు 25న అన్ని భాషలతో పాటు విడుదల చేసి ఉంటే మెరుగైన వసూళ్లు దక్కేవి. మూవీ డిజాస్టర్ అని తెలిశాక హిందీ వర్షన్ థియేటర్స్ లోకి వచ్చింది. అయినప్పటికీ లైగర్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టడం విశేషం. ప్రీమియర్ కలెక్షన్స్ తో కలిపి లైగర్ ఫస్ట్ డే రూ. 5.75 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా సెకండ్ డే రూ.4.25 కోట్లు కొల్లగొట్టింది. మూడో రోజు ఆదివారం కూడా లైగర్ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. థర్డ్ డే రూ.3.75 కోట్లు లైగర్ వసూలు చేసింది. 

మూడు రోజులకు గానూ రూ. 13.75 కోట్ల నెట్ కలెక్షన్స్ లైగర్ కి దక్కాయి. రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన లైగర్ ఇప్పటి వరకు రూ.6.25 కోట్ల షేర్ అందుకుంది. ఇక సోమవారం నుండి లైగర్ కి అసలు పరీక్ష మొదలుకానుంది. నెక్స్ట్ వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టినా... ఈజీగా బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది. ట్రెండ్ చూస్తుంటే స్వల్పంగా లాభాలు పంచే సూచనలు కలవు. తెలుగులో పూర్తిగా చతికిలబడిన లైగర్ హిందీలో ఆ మాత్రం వసూళ్లు సాధించడం గొప్ప విషయం. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ తెరకెక్కింది. అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. మైక్ టైసన్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఛార్మి, కరణ్ జోహార్ నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios