మహేష్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడు కు ఉండదు చెప్పండి. అందరి కలా అదే. అయితే అందులో కొందరికే ఆ కల నెరవేరుతుంది. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో అనీల్ రావిపూడికి ఆ చిరకాల వాంఛ నెరవేరింది. ఆ తర్వాత ఇప్పుడు గీతా గోవిందం తో హిట్ కొట్టిన పరుశరామ్ సూపర్ స్టార్ ని డైరక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరో యంగ్ డైరక్టర్ కు ఆ అవకాసం వచ్చిందని సమాచారం. భీష్మ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న వెంకీ కుడుములతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.  ఇక ఇటీవల ‘భీష్మ’ను చూసిన మహేష్‌కు ఆ మూవీ బాగా నచ్చిందట. ఈ క్రమంలో దర్శకుడికి ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకున్నారట మహేష్. అంతేకాదు తన కోసం ఏదైనా ఓ స్టోరీని రాసుకు రమ్మని వెంకీ కుడుమలకు సూచించారట. 

దాంతో ఛ‌లో, భీష్మ వంటి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల‌ని సొంతం చేసుకున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్  ఓ అదిరిపోయే స్టోరీ లైన్ ని మహేష్ కు నేరేట్ చేసాడట. త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ చెప్పిన స్టైల్‌, స్టోరీ లైన్ న‌చ్చిన మ‌హేష్ వెంటినే ఈ లైన్‌ని డెవ‌ల‌ప్ చెయ్ మ‌నం చేద్దామ‌ని వెంకీకి ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ప్ర‌స్తుతం ఈ లైన్‌ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చేప‌నిలో వెంకీ కుడుముల బిజీ అయిపోయార‌ని సమాచారం. మ‌హేష్‌కి వెంకీ సిద్ధం చేసిన  స్క్రిప్ట్ న‌చ్చితే సినిమా ప‌ట్టాలెక్క‌డం ఇక లాంఛ‌న‌మే అంటున్నారు. అదే కనుక జ‌రిగితే వెంకీ కుడుముల ద‌శ తిరిగిన‌ట్టే.

మరో ప్రక్క ప‌ర‌శురామ్ చిత్రాన్ని ఓకే చేసిన మ‌హేష్‌బాబు త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌రశురామ్ చెప్పిన లైన్ సింపుల్‌గా, కొత్త‌గా వుండంతో మైత్రీ మూవీమేక‌ర్‌స బ్యాన‌ర్‌లో చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన హీరో మ‌హేష్ ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలైలో ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ప‌ర‌శురామ్ ఈ స్క్రిప్ట్‌కు దుదిమెరుగులు దిద్దేప‌నిలో వున్నాడ‌ట‌.