ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ వద్ద ఉన్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులను అమ్మడం ద్వారా మంచి డబ్బు సంపాదించినట్లు మేకర్స్ ఇటీవల అఫీషియల్ గా  ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తన రీసెంట్ గా కొన్న శ్యామ్ సింగ రాయ్ కోసం 3 వారాల OTT రిలీజ్ చేసింది.


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ పై మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డీల్ ని లాక్ చేసారని సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ వద్ద ఉన్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులను అమ్మడం ద్వారా మంచి డబ్బు సంపాదించినట్లు మేకర్స్ ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తన రీసెంట్ గా కొన్న శ్యామ్ సింగ రాయ్ కోసం 3 వారాల OTT రిలీజ్ చేసింది. మరి గని సినిమా కోసం ఎటువంటి ఎగ్రిమెంట్ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. థియేట్రికల్ విడుదల తర్వాత గని OTT ప్లాట్‌ఫారమ్‌పైకి ఎప్పుడు వస్తాడో మరి. మాగ్జిమం నాలుగు వారాల ఎగ్రిమెంట్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తోంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగిందని మేకర్స్ చెప్తున్నారు.

 సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.