మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే విశెష్‌ తెలిపారు. ఆయన ఉన్న టైమ్‌లో తాను ఉన్నందుకు గర్వపడుతున్నానని చిరంజీవి చెప్పడం విశేషం. మలయాళంలో అగ్ర హీరోల్లో ఒకరిగా, తిరుగులేని టాప్‌ స్టార్‌గా ఉన్న `మమ్ముక్క' మమ్ముట్టి నేడు(సోమవారం) 68వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

ఈ సందర్భంగా చిరంజీవి.. మమ్ముట్టికి ట్విట్టర్‌ ద్వారా బర్త్ డే విశెష్‌ తెలిపారు. `జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమ మమ్ముక్క. ఈ అద్భుతమైన పరిశ్రమలో మీ కొలిగ్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఇన్నేళ్ళుగా మీరు ఎంతో విలువైన సంపదని ప్రేక్షకులకు అందించారు. మీరు మరెన్నో సంవత్సరాలు ఇలానే ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా` అంటూ చివరగా మలయాళంలో శుభాకాంక్షలు తెలపడం విశేషం. చిరు బర్త్ డే విశెష్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 

చిరంజీవితోపాటు మలయాళ సినీ తారలు, అలాగే సౌత్‌ స్టార్స్ మమ్ముట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక గతేడాది `మామాంగం` చిత్రంతో మెప్పించిన మమ్ముట్టి ప్రస్తుతం `ది ప్రీస్ట్`,`వన్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.