మహిళా దర్శకురాలు షోనాలి బోస్ దర్శకత్వంలో ది స్కై ఈజ్ పింక్ చిత్రం తెరకెక్కుతోంది. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఫరాన్, ప్రియాంక చోప్రా కెమిస్ట్రీ, ఎమోటినల్ పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. షూటింగ్ లో జరిగిన సరదా సంఘటనల్ని ఈ వీడియోలో చూపించారు. ఫరాన్ ని ప్రియాంక ఆటపట్టిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. 

ఫరాన్ ప్రియాంకని తన వీపుపై ఎక్కించుకుని సన్నివేశం కోసం ఎదురుచూస్తున్నాడు. దర్శకుడు యాక్షన్ చెప్పే వరకు పాపం పిసీని అలా మోస్తూనే ఉండాలి. ప్రియాంక మాత్రం అతడిపై ఎక్కి ఎంజాయ్ చేస్తోంది. నేను చాలా బరువు తక్కువ. నన్ను ఈజీగా మోయొచ్చు అని ఫరాన్ తో అంటోంది. ఇలా షూటింగ్ మొత్తం ఫరాన్ అక్తర్, ప్రియాంక చోప్రా ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ కనిపించారు.