తమిళ స్టార్ హీరో తలా అజిత్ చాలా విషయాల్లో క్లారిటీగా ఉంటారు. ప్రతీ విషయాన్ని తనదైన శైలిలో డీల్ చేస్తూంటారు. అదే పద్దతిలో రీసెంట్ గా తన తాజా చిత్రం  ‘వలిమై’ విషయంలో నిర్మాత బోనీ కపూర్ కు స్ట్రిక్ట్ గా ఇనస్ట్రక్షన్స్ ఇచ్చారట. కంగారపడి ఏదీ చేయవద్దని అన్నారట. రెండు నెలలు షూటింగ్ పెండింగ్ ఉందని, తమిళనాడు గవర్నమెంట్ ఫర్మిషన్ తీసుకుని పూర్తి చేద్దామంటే అర్జెంట్ ఏమీ లేదని,కరోనా టైమ్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, ఏదైనా సమస్య రేపు సెట్ లో వస్తే పరిష్కరించటం కష్టమని క్లియర్ గా చెప్పారట. అజిత్ అలా అంటాడని ఊహించని బోనీకు షాక్ కొట్టినట్లైందిట. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ కు రెడీ చేద్దామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.
 
వివరాల్లోకి వెళితే అజిత్ హీరోగా ‘నేర్‌కొండ పార్‌వై’(బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `పింక్`కి త‌మిళ్ వెర్ష‌న్) దర్శకుడు హెచ్.వినోద్ రూపొందిస్తున్న చిత్రం ‘వలిమై’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జోడిగా ‘కాలా’ఫేమ్ హ్యూమా ఖురేషి న‌టిస్తోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు సమకూరుస్తున్నాడు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వలిమై’కి కరోనా వైర‌స్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ బ్రేక్ పడింది.  

దాంతో వలిమై సినిమా విడుదల ఇప్పుడు వాయిదా పడనుంది.  తొలుత ఈ చిత్రాన్ని 2020 దీపావళికి లేదంటే 2021 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ముందు అనుకున్నట్టుగా ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికో లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు తప్ప వేరే ఏమీ క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే.. 2021 వేస‌వికి తప్ప ఇప్పుడిప్పుడే రిలీజ్ కు రాదని  కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే ‘వలిమై’ షూటింగ్, విడుద‌ల తేదీకి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. వలిమై చిత్రంలో అజిత్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.