గాయకుడు ఎస్పీ బాలు లేరనే వార్త అభిమానలోకం జీర్ణించుకోలేకపోతుంది. దుఖసాగరంలో మునిగిపోతున్నారు. తమని మంత్రముగ్ధుల్ని చేసిన గాత్రం ఇక పాడదనే చేదు నిజం తెలుసుకుని  కన్నీరుమున్నీరవుతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. బాలు చనిపోయారని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలి వస్తున్నారు. 

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

దీంతో ఎంజీఎం హాస్పిటల్‌లో ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది హాస్పిటల్‌ మొత్తం శానిటైజ్‌‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఏం మాట్లాడలేకపోతున్నా` అని దర్శకుడు, నటుడు భారతీరాజా భావోద్వేగానికి గురయ్యారు. భారతీరాజాకి, భారతీరాజాకి విడదీయలేని అనుబంధం ఉంది. సినిమాల్లో పాటల పరంగానే వ్యక్తిగతంగానూ వీరిద్దరు మంచిస్నేహితులు. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

కరోనా సోకడంతో బాలుని ప్రత్యేకంగా అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోసుకుంటున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు తనకిష్టమైన తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లాలోని తమరైపక్కమ్‌ విలేజ్‌లోని రెడ్‌ హిల్స్ లో  ఉన్న తన 14ఏకరాల ఫామ్‌ హౌజ్‌లో శనివారం మధ్యాహ్నం నిర్వహించాలని  నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం బాలు భౌతికకాయాన్ని చెన్నైలోని తన నివాసానికి తీసుకెళ్ళి అభిమానులు, సినీ వర్గాల సందర్శనార్థం ఉంచారు. రేపు ఉదయం సత్యం థియేటర్‌కి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనుందని సమాచారం.

Also Read:

ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!