ఆయన పాట పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. ఆయనే గాన గంధర్వుడు పద్మభూషణ్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం. బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. పాటలోని మాటలను ...గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. ఆయన గొంతకు తరాల అంతరాలు తెలియదు. ఈ సందర్భంగా బాలు సూపర్‌హిట్‌ సాంగ్స్ ని ఓ సారి చూస్తే.. 

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

`అభినందన` సినిమాలోని `ప్రేమ లేదని,.. ప్రేమించ రాదని.. ` ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలుసు. మ్యూజికల్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బాలు పాటలు ప్రధాన అసెట్‌గా నిలిచాయి. సినిమాని విజయతీరానికి చేర్చాయి. సినిమాకు పాటలు ప్రాణం అని, వెన్నముఖ అని నిరూపించాడు బాలు. 

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

ఇక వెంకటేష్‌ హీరోగా వచ్చిన `ప్రేమ` సినిమాలో `ప్రియతమా.. నా హృదయమా..`పాట మన మనసు ద్రవించిపోతుంది. ప్రేమని వ్యక్తం చేస్తూ, దూరమవుతున్న ఆ ప్రేమని తలచుకుని వెంకీ పాడే ఈ పాట ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది బాలు గాత్రంలోని మ్యాజిక్‌ అని చెప్పొచ్చు. రొమాంటిక్‌ పాటలు ఇంత బాగా పాడగలడని బాలు పదే పదే నిరూపించుకున్నారు. 

చిరంజీవి హీరోగా రూపొందిన `రుద్రవీణ`లో పాటలు ఎంత ఫేమస్సో చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమాకి ప్రాణం పాట. అది బాలు పాట కావడంతో సినిమాకి వన్నే వచ్చింది. పాటల ప్రావాహంలా సాగే ఈ చిత్రంలో `తరలిరాగా.. తనే వసంతం.. ` పాట వింటూ ఇప్పటికీ మన మనసు పులకరించిపోతుంది. అది బాలు పాటలోని మాధుర్యానికి నిదర్శనం. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

`మహార్షి` సినిమాలో విషాద పాట `మాటరాని మౌనమిది.. ` వింటే కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేరు. ఈ విషాద ప్రేమ గాథ పాట ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. అలాంటి మరోపాట నాగార్జున నటించిన `గీతాంజలి`లో  `ఓ పాపా లాలి`.. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ పాట మంచు కురుస్తున్న వేళ, పచ్చని ప్రాంతంలో ప్రియురాలిని ఉద్దేశించి నాగార్జున పాడే ఈ పాట అందరిని కదిలిస్తుంది. కాన్సర్‌ బారిన పడ్డ ఇద్దరుప్రేమికుల విషాద గాథకి కేరాఫ్‌గా నిలిచింది. ఈ పాట బాలు పాడిన ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్ ల్లో ఒకటిగా నిలిచింది.

Also Read:ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

మోహన్‌ నటించిన `ఆలాపన` చిత్రంలో `ఆవేషమంతా` అనే సాంగ్‌ కూడా మన హృదయాలను గిల్లుతుంది. కమల్‌ హాసన్‌ నట విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచే ఓ చిత్రం `ఇంద్రుడు చంద్రుడు`. ఇందులో ఓ పాపని జోలపాడే క్రమంలో వచ్చే `లాలి జో లాలి జో.. ` పాట వింటే ఇప్పటికీ మన గుండె తరుముకుపోతుంది. బాలు నుంచి వచ్చిన అద్భుతమైన పాట ఇదని చెప్పొచ్చు. 

Also Read:బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

బాలు గాత్రానికి మరో దృశ్య రూపం `మంచి మనుసులు` సినిమాలోని `జాబిలి కోసం`. ఇది ఓ విషాద గాథ పాటే. భాను చందర్‌ నటించిన ఈ సినిమాలోని అన్ని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. అందులో `జాబిలి కోసం` అంటూ సాగే విషాద గాథ పాట వింటే మైమరపించి పోతాం. 

చిరంజీవి హీరోగా వచ్చిన `అభిలాష` చిత్రంలోని `నవ్వింది మల్లె చందు` అంటూ సాగే పాట మనలో హుషారుని తెప్పిస్తుంది. అలాగే కార్తిక్‌, బానుప్రియా ల `అన్వేషణ` చిత్రంలోని `కీరవాణి` పాట కూడా ఆద్యంతం జోష్‌ఫుల్‌గా, ప్రియురాలిని ఆటపట్టిస్తూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కమల్‌ హాసన్‌ నటించిన `సాగర సంగమం`లోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి పాట మన్నలి ఒలలాడిస్తుంది. ఆ పాటల పల్లకిలో ఊరేగిస్తుంది. 

Also Read:సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

 ఒక్కటేమిటి ఆయన పాడిన ప్రతి పాట ఓ అద్భుతం. ప్రతి పాట పరిమళాలు వెదజల్లే పూదోట. ఆయన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత పొగిడినా తక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు పడుతుంది. అయినా ఆ పాటల అది తనవితీరదు. ఇంకా ఏదో చెప్పాలనిపిస్తూనే ఉంటుంది. ఐదున్నర దశాబ్దాల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను తన పాటల ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేశాయి. అందులో తడిపి ముద్ద చేశారు. 

Also Read:ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

బాలు పాటలే ప్రాణంగా బతికాడు. పాటనే ప్రాణంగా భావించాడు. పాటే దేవుడిగా చూసుకున్నాడు. పాటే పంచామృతంగా ఆస్వాధించాడు. పాట, తాను వేర్వేరు కాదని, పాటే తన ప్రాణమని తన పాటలతోనే సాటాడు. పాట కోసం బతికాడు. పాట కోసమే కరోనాతో చివరి వరకు పోరాడాడు. కానీ ఇక ఆయన శక్తి చాలలేదు. తన పాట విశ్రాంతి కోరుకుంటుందని భావించాడేమో, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. శ్రోతలను దుఖ సాగరంలో ముంచేత్తాడు. భారతీయ చిత్ర పరిశ్రమే విషాదంలోకి నెట్టేశాడు.