శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్య కాస్తా ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం అయ్యారు. అభిమానులు, ఆయనను ఇష్టపడేవాళ్లు ఎస్బీ బాలు అంటారు. కానీ, ఎస్బీ బాలసుబ్రహ్మణ్యానికి ఓ ముద్దు పేరు కూడా ఉంది. అదే మణి. కుటుంబ సుభ్యులు, మిత్రులు చివరి వరకు ఆయనను మణి అనే పిలుస్తూ వచ్చారు. 

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

సినిమా పరిశ్రమలో మాత్రం కొద్ది మందే ఆయనను మణి పిలుస్తారు. సంగీత దర్శకులు చక్రవర్తి, మహదేవన్ మాత్రం మణి అని పిలిచేవారు. చక్రవర్తి అప్పుడప్పుడు చిన్నా అని పిలిచేవారు. బాలుకు సినీ పరిశ్రమలో బంధువులున్నారు. అయితే, సినీ రంగంలోకి అడుగు పెట్టేవరకు కూడా పెద్దగా సాన్నిహిత్యం లేదు. 

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

ఎస్బీ కోదండపాణి బాలసుబ్రహ్మణ్యాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే, ఎంత మాత్రమూ బంధుత్వం వల్ల కాదు. వారిద్దరికి మధ్య చుట్టరికం ఉన్నట్లు కూడా తెలియదు. తాను బ్రాహ్మణ్యంలోకి మారానని కోదండపాణి అన్నారట. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

చంద్రమోహన్ తో, విశ్వనాథంలతో మాత్రం బంధుత్వం ఉంది. అయితే, ప్రైవేట్ మాస్టార్ సినిమా రికార్డు సమయంలో మాత్రమే బాలు విశ్వనాథాన్ని చూశారు. చంద్రమోహన్ తో దూరపు బంధుత్వం ఉండేది.

Also Read:ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

చంద్రమోహన్ తొలి సినిమాకు మాత్రం ఎస్బీ పాటలు పాడలేదు. ఆ తర్వాత చంద్రమోహన్ నటించిన ప్రతీ సినిమాకు ఎస్బీ బాలు పాడుతూ వచ్చారు. 

Also Read:బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

బాలసుబ్రహ్మణ్యానికి పల్లవి అనే కూతురు, చరణ్ అనే కుమారుడు ఉన్నారు. హాస్యనటుడు అలీ చిన్నప్పటి నుంచి వాళ్ల ఇంటి పక్కనే ఉండేవాడు. అలీకి చరణ్ కు మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

Also Read:సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

బాలసుబ్రహ్మణ్యం 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది.

Also Read:ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....