Asianet News TeluguAsianet News Telugu

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాయకులు చాలా నియమాలు పాటిస్తారని భావిస్తారు. గొంతు పాడు కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటారు. కానీ ఎస్బీ బాలసుబ్రహ్మణ్యానికి అటువంటి పట్టింపులు గానీ భయాలు గానీ లేవు. సినిమాల్లో పాటలు పాడుతున్న కాలంలో కూడా ఆయన స్మోక్ చేసేవారు. 
 

SP Balasubrahmanyam Quit Smoking Because Of His Daughter
Author
Hyderabad, First Published Sep 25, 2020, 1:55 PM IST

గాయకులు చాలా నియమాలు పాటిస్తారని భావిస్తారు. గొంతు పాడు కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటారు. కానీ ఎస్బీ బాలసుబ్రహ్మణ్యానికి అటువంటి పట్టింపులు గానీ భయాలు గానీ లేవు. సినిమాల్లో పాటలు పాడుతున్న కాలంలో కూడా ఆయన స్మోక్ చేసేవారు. 

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

అది ఆర్డీ బర్మన్ వంటివాళ్ల సాన్నిహిత్యం వల్ల స్మోకింగ్ కొనసాగుతూ వచ్చిందట. అయితే, తన కూతురు పల్లవి మాటతో ఆయన స్మోకింగ్ మానేశాడు. అప్పటి నుంచి ఆయన సిగరెట్లు తాగడం మానేశారు. నిజానికి ఎస్పీ బాలు స్మోకింగ్ కు బానిసయ్యారు.  

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

కుమారుడు చరణ్ జోక్...

రా దిగి రా... దివి నుంచి భువికి దిగి రా అనే పాట విశేషమైన జనాదరణ పొందింది. చంద్రమోహన్ నటించిన సిరిసిరి మువ్వ సినిమాలోది ఆ పాట. అయితే, ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దానిపై జోక్ చేశాడు. బాలు, చరణ్ తండ్రీకొడుకులే అయినా మిత్రుల్లా ఉండేవారు. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

రా దిగి రా.. అనే పాటను ప్రస్తావిస్తూ నాన్నగారూ.. మలబద్దకం ఉన్నవాళ్ల కోసం మంచి పాట పాడావు అన్నారట. అంతా అయిపోయాక రామ హరే... రామ హరే... అని అనుకోవాలని అన్నాడట. ఇది కేవలం వారి ఆంతరంగికమైన విషయం మాత్రమే. అది పాటు గొప్పదనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ఆ పాట యావత్తూ తెలుగు ప్రజానీకం గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయింది.

Also Read:

ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!

Follow Us:
Download App:
  • android
  • ios