`ఆపరేషన్‌ దుర్యోధన` ఐటెమ్‌ భామ,నటి, మోడల్‌ గెహ్నా వశిష్ట్ పోర్న్ వీడియో రాకెట్‌ కేసులో అరెస్ట్ అయ్యారు. తన వెబ్‌ సైట్‌లో పోర్న్ వీడియోలను ఉంచినట్టు ఆధారాలు లబించడంతో ఆమెని శనివారం ముంబయికి చెందిన క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పోర్న్ వీడియో రాకెట్‌లో మొదట అనుమానంతో పోలీస్‌లు కొంత మందిని అరెస్ట్ చేసి విచారించారు. వీరిలో గెహ్నా వశిష్ట్ కూడా ఉన్నారు. ఈ విచారణలో తన వెబ్‌ సైట్‌లో 87 వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. ఇది నిజమే అని ఆధారాలు లభించడంతో ఆమెని ఆదివారం కోర్ట్ లో ప్రవేశ పెడుతున్నారు. ఈ కేసులో గెహనాతోపాటు ఇతర మోడళ్ల ప్రమేయం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. 

ముంబయి, మలద్‌లోని మల్వానీ ప్రాంతాల్లోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరణ జరుగుతుందని శుక్రవారం క్రై బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు బంగ్లాపై పోలీసులు రైడ్‌ చేశారు. ఇందులో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు నటులు, ఓ లైట్‌మ్యాన్‌, మహిళా ఫోటోగ్రాఫర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌ ఉన్నారు. ఈ పోర్న్‌ వీడియో రాకెట్‌ నుంచి ఇద్దరు అమ్మాయిలను సంరక్షించారు. నిందితులు మొబైల్‌ ఫోన్ల ద్వారా వీడియోలు‌ తీస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఆరు సెల్‌ఫోన్స్, ఒక లాప్‌ట్యాప్‌, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.

`ఫిల్మ్ దునియా` సినిమాతో హిందీలోకి అడుగుపెట్టిన గెహనా వశిష్ట్ ఏక్తా కపూర్‌ నిర్మించిన వెబ్‌ సిరీస్‌ `గాండి బాత్‌`తో పాపులర్‌ అయ్యారు. ఓ వైపు నటిగా, మరోవైపు మోడల్‌గా రాణిస్తుంది. అనేక మేగజీన్లకి గ్లామర్‌ ఫోటో షూట్‌లు ఇస్తూ రచ్చ చేసిందీ అమ్మడు. అంతేకాదు 2007లో వచ్చిన `అపరేషన్‌ దుర్యోధన` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి తెలుగులోనూ అలరించింది.  వీటితోపాటు `ఆపరేషన్‌ దుర్యోధన 2`, `అనుకున్నది ఒకటి అయినది ఒకటి`, `నమస్తే`, `33 ప్రేమ కథలు`, `ఐదు`, `ప్రేమించు పెళ్లాడు`, `బీటెక్‌ లవ్‌ స్టోరీ` వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది.