బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మూడో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా స్వాతి దీక్షిత హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. రావడం రావడంతోనే అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ స్వాతికి ఫిదా అయ్యాడు. అందం అంటే ఇలా ఉంటుందా? అని ప్రశంసలతో ముంచెత్తాడు. 

దేవతగా కొనియాడాడు. మొత్తానికి బాగానే సోప్‌ వేశాడు. పులిహోరా కలిపాడు. కానీ నాల్గోవారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్‌ నుంచి ఇలాంటి షాక్‌ తగులుతుందని స్వాతి ఊహించలేదు. 

కట్‌ చేస్తే, స్వాతి నాల్గోవారం ఎలిమినేట్‌ అయ్యింది. గన్‌ టాస్క్ లో ఆమె వంతు వచ్చేటప్పుడు గన్‌ పేలింది. దీంతో హౌజ్‌ నుంచి వారం తిరగకుండానేవ ఎళ్ళిపోయింది. అయితే హౌజ్‌ సభ్యులపై అభిప్రాయాలు పంచుకుంటూ అమ్మ రాజశేఖర్‌ గురించి చెబుతూ, నమ్మకద్రోహి అని బాంబ్‌ పేల్చింది. 

ఆ బాంబే కాదు బిగ్‌బాంబ్‌ కూడా ఆయనపైనే పేల్చింది. వచ్చే వారం హౌజ్‌ కెప్టెన్సీ  పోటీలో పాల్గొనకుండా ఉండేందుకు నామినేట్‌ చేసింది. ఇలా ప్రతీకారం తీర్చుకుంది. దీంతో అమ్మ రాజశేఖర్‌కి దిమ్మతిరిగిపోయింది.