డిఫరెంట్ సినిమాలతో గ్యాప్ లేకుండా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సూర్య మొత్తానికి మరో సినిమాతో రెడీ అయ్యాడు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో కాప్పాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బందోబస్త్ పేరుతో భారీగా విడుదల చేస్తున్నారు. 

మోహన్ లాల్ - ఆర్య కూడా సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ సీన్స్ తో సినిమా మంచి థ్రిల్ ఇవ్వనుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేసింది. ఇక తెలుగు సెన్సార్ పనులని కూడా సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్న బందోబస్త్ సినిమా 165నిమిషాల నిడివి కలిగి ఉంది. 

కెవి.ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన వీడోక్కడే - బ్రదర్స్ సినిమాను మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మూడవ సినిమా వస్తుండడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.