F2 సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ వెంకిమామ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు నాగచైతన్య తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎండింగ్ కి వచ్చేసింది. ఇంకా సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయలేదు.

అయితే ఆ సినిమా పనులను దాదాపు ఫినిష్ చేసుకున్న వెంకటేష్ మరో సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  రీమేక్  మల్టి స్టారర్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే విక్టరీ వెంకటేష్ ఇటీవల మరో తమిళ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రీమేక్ రైట్స్ కి పోటీ ఎక్కువవుతున్న సమయంలో సురేష్ బాబు తన బిజినెస్ మైండ్ తో అసురన్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Read also: ఆ రీమేక్ లో... ఇక్కడ వెంకటేష్, అక్కడ షారూఖ్!

ఇకపోతే సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని సురేష్ బాబు డిసైడ్ అయ్యారట. ఇక దర్శకుడు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.   కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఓంకార్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించదానికి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వస్తోంది.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అసలైతే ఓంకార్ వెంకీతో రాజుగారి గది 4 సినిమా చేయనున్నట్లు పలు ఇంటర్వ్యూలతో చెప్పాడు. ఇక ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనతో వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ మారినట్లు తెలుస్తోంది. తమిళ్ లో 100కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న అసురన్ సినిమాకు వెట్రి మారన్ దర్శకత్వం వహించాడు. మరి తెలుగులో ఈ సినిమా కథ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.