ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం అన్ని భాషల హీరోలు, నిర్మాతలు క్యూలు కడుతున్నారు. హిట్ సినిమా రీమేక్ చేస్తే తమకు అయాచితంగా ఓ హిట్ వచ్చి పడుతుందని భావిస్తున్నారు. దాంతో రీమేక్ రైట్స్  ఎవరు తెచ్చుకున్నారో వాళ్లకే హీరోలు డేట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఫ్లాఫ్ ల్లో ఉన్న హీరోలు ..రీమేక్ ల వైపు చూస్తున్నారు.

తాజాగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం‘అసురన్’. ధనుష్ నటించిన  ఈ చిత్రానికి వెట్రి మారన్ దర్శకుడ. ఈ చిత్రంలోని కంటెంట్, ధనుష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే కాదు స్టార్ హీరోలను సైతం విపరీతంగా ఇంప్రస్ అయ్యిపోయారు. ఈ చిత్రాన్ని చూసిన విక్టరీ వెంకటేష్ వెంటనే తెలుగులోకి రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.

తెలుగులో ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఈ  చిత్రాన్ని చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ని సైతం చాలా బాగా మెప్పించిందని, చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం . గత కొంతకాలంగా సినిమాలు ఒప్పుకోకుండా అజ్ఞాతవాశంలో ఉండిపోయారు షారూఖ్.

‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ చేసిన పనికి.. సీరియస్ అయిన మహేష్

దాంతో ప్రస్తుతం షారుక్ రెగ్యులర్ కథల్ని కాకుండా సౌత్ నుండి వస్తున్న భిన్నమైన తరహా కథల్ని చేయాలనుకుంటున్నారు. ఈ  క్రమంలో ఆయనకు ఈ సినిమా గురించి తెలిసి స్పెషల్ షో వేయించుకుని చూసారట. తెగ నచ్చేసి దర్శకుడుతో ఓ గంట సేపు మాట్లాడి ఓకే చేసినట్లు సమాచారం. అలా తెలుగులో వెంకి, తమిళంలో షారూఖ్ చేయనున్నారు. మరి కన్నడ, మళయాళ వెర్షన్ లలో ఎవరు చేస్తారో చూడాలి.