Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బిజినెస్ విషయంలో నమ్రత జోక్యంపై కృష్ణ కామెంట్స్.. పెద్ద కొడుకు ఫైల్యూర్ కి కారణం..

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ లో తారా స్థాయి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు మహేష్.

Super Star Krishna comments on his elder son Ramesh failure and success of Mahesh
Author
Hyderabad, First Published Aug 30, 2021, 2:53 PM IST

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ లో తారా స్థాయి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు మహేష్. రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మహేష్ బాబు పెద్ద స్టార్ అవుతాడని చిన్నప్పుడే అందరూ ఊహించారు. చాలా పెద్ద స్టార్ అవుతాడు అని అప్పట్లోనే ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పారు. అలాగే జరిగింది. ఇక తన పెద్ద కుమారుడు రమేష్ బాబు ఫెయిల్యూర్ గురించి కూడా కృష్ణ స్పందించారు. 

రమేష్ బాబుకి కొన్ని రాంగ్ సబ్జెక్టులు పడ్డాయి. దాసరి నారాయణరావు తీసిన బ్లాక్ టైగర్ లాంటి చిత్రాలు బాగా దెబ్బ తీశాయి. అందువల్ల రమేష్ బాబుకు నటనపై ఆసక్తి  పోయింది అని కృష్ణ అన్నారు. 

మహేష్ బాబు తన ట్యాలెంట్ తోనే స్టార్ గా ఎదిగారు. కానీ ఎండార్స్ మెంట్స్ విషయంలో మహేష్ బ్రాండ్ ని నేషనల్ లెవల్ కు తీసుకువెళ్లడంలో నమ్రత పాత్ర ఉందని అంటూంటారు. అది నిజమేనా అని ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని కృష్ణ అన్నారు నమ్రత మహేష్ బాబు సినిమాలు, బిజినెస్ విషయంలో జోక్యం చేసుకోదు. 

నమ్రత తన పిల్లలు, సంసారం అన్నట్లుగా హౌస్ వైఫ్ గానే ఉంటుంది అని కృష్ణ అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios