Asianet News TeluguAsianet News Telugu

డీజే టిల్లు తో ప్రేమలో పడ్డ శ్రీలీల, ఇక పెళ్ళి సందడి చేయబోతున్న సిద్థు

డీజే టిల్లుగాడితో ప్రేమలో పడింది పెళ్లి సందడి ఫేమ్ హీరోయిన్ శ్రీలీలా. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. సిద్థు జోన్నల గడ్డతో జోడీ కట్టబోతోంది. 

Sreeleela will be playing Heroine role in dj tillu Movie
Author
Hyderabad, First Published Aug 20, 2022, 11:52 AM IST

పెళ్ళి సంద‌డి  సినిమాతో తెలుగు తెరపైకి  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్  శ్రీలీల‌. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు శ్రీలీలా గ్లామర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అటు  మాస్ ప్రేక్ష‌కుల‌ను ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది బ్యూటీ. ఈసినిమా అంతో ఇంతో  స‌క్సెస్‌ అయ్యిందంటే అందులో ఎక్కువభాగం  క్రెడిట్ శ్రీలీలకే ద‌క్కుతుంది. ఈ సినిమాలో  శ్రీలీల త‌న అందం, అభిన‌యంతో చ‌లాకీ అమ్మాయిగా ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. 

శ్రీలీలా అంటే  యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే అది గమనించిన మేకర్స్ ఆమెకు వరుసగా అవకాశాలు కట్టబెడుతున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం  అర‌డ‌జ‌నుకు పైగానే సినిమాలున్నాయి. కాగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టిన సినిమాల్లో డీజే టీల్లు  కూడా ఒక‌టి. మార్చ్‌12న రిలీజ్ అయిన ఈసినిమా మూడంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టింది. ఈ మూవీలో ముఖ్యంగా సిద్థు జోన్నలగడ్డ పెర్ఫామెన్స్, మాస్ యాంగిల్ కు లేడీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 

ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేశారు. దాంతో ఆడియన్స్ ఈసినిమా కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న సీక్వెల్ మూవీ.. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. కాగా ఈ సీక్వెల్‌లో సిద్దూకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది. మేక‌ర్స్ హీరోయిన్‌గా ప‌లువురు పేర్లు అనుకున్న చివ‌రికి శ్రీలీల‌ను ఎంపిక చేశార‌ట‌. అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. 

ఇక ఈ విషయంలో అధికారికంగా ప్ర‌కట‌న రావాల్సి ఉంది దానికోసమే  సిద్థు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో ముందుగా హీరోయిన్‌గా అనుప‌మ‌ను సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వచ్చాయి. ఇప్పుడేమో శ్రీలీల సెలక్ట్ అయ్యిందని  న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఏది నిజ‌మో తెలియాలంటే.. మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకూ ఆగాల్సిందే. 

ఏమంటా పెళ్లి సందడి సినిమాతో అడుగు పెట్టిందో.. స్టార్ హీరోయిన్లను మించి అవకాశాలు  శ్రీలీల‌ గుమ్మం ముందు క్యూ క‌డుతున్నాయి.  యంగ్ హీరోలతోపాటు... సీనియర్ హీరోలు కూడా శ్రీలీలా కావాంటున్నారు. ర‌వితేజ‌తో క‌లిసి న‌టించిన ధ‌మాకా సినిమాలో కూడా నటించింది బ్యూటీ.  షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది.  ఇక దీనితో పాటుగా నవీన్ పోలిశెట్టితో అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాలో న‌టిస్తుంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ నాలుగ‌వ సినిమాలో కూడా శ్రీలీల‌నే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఇలా వరుసగా సినిమాల చేసుకుంటూ..స్టార్ హీరయిన్ రేసులోకి ఎంటర్ కావాలని చూస్తుంది. ఇలా వరుస సినిమాలు, వరుస సక్సెస్ లు వస్తుంటే.. త్వరలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios