ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత నెలన్నర రోజులుగా కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన కరోనా నుంచి బయటపడ్డారు. ఆయనకు కోవిడ్‌-19 నెగటివ్‌ వచ్చింది. క్రమంగా ఆయన కోలుకుంటున్నారు. గత నెల ఐదో తేదీని ఆయన కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

ఊపిరితిత్తులకు సంబంధించి, అలాగే ఇతర అనారోగ్య కారణాలతో ఆయన ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. బాలు త్వరగా పూర్తి  స్థాయిలో కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుతున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయనో పోస్ట్ పెట్టారు. బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతుందన్నారు. ఎక్మో, వెం

టిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతుందన్నారు. తన తండ్రికి వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందానికి, అభిమానులకు చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.