Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ తో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ లిప్ లాక్.. హాట్ టాపిక్ గా మారిన ఘాటు రొమాన్స్

హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తమిళంలో బిజీగా సినిమాలు చేస్తోంది. అయితే తెలుగులో మాత్రం ప్రియా భవానికి అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే తరచుగా ఆమె వార్తల్లో కెక్కడం చూస్తూనే ఉన్నాం.

SJ Surya Lip lock with actress priya bhavani shankar dtr
Author
First Published Jun 8, 2023, 3:19 PM IST

హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తమిళంలో బిజీగా సినిమాలు చేస్తోంది. అయితే తెలుగులో మాత్రం ప్రియా భవానికి అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే తరచుగా ఆమె వార్తల్లో కెక్కడం చూస్తూనే ఉన్నాం. దర్శకుడిగా గుర్తింపు పొంది ఇప్పుడు ఊహించని విధంగా విలక్షణ నటుడిగా మారారు ఎస్ జె సూర్య. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎస్ జె సూర్య ఖుషి, పులి లాంటి చిత్రాలు తెరకెక్కించారు. గత కొన్నేళ్లుగా నటుడిగా టర్న్ తీసుకున్న ఆయన మహేష్ బాబు స్పైడర్, విజయ్ మెర్సల్, శింబు మానాడు చిత్రాల్లో విలక్షణ నటనతో విలనిజంతో ఆశ్చర్యపరిచారు. సైకో తరహాలో కామెడీ టచ్ తో ఆయన పండించే విలనిజం అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రాంచరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు. 

అయితే సూర్య తమిళంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బొమ్మై. ఈ మూవీలో సూర్య బొమ్మలపై ఇష్టంతో క్రమంగా అవే ప్రపంచంగా మారిపోతాడు. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్య, ప్రియా భవాని శంకర్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ప్రియా భవాని శంకర్ తో లిప్ లాక్ ఉండడంతో ట్రైలర్ ఒక్కసారిగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. విలన్ తో హీరోయిన్ లిప్ లాక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios