మెగాస్టార్ ఎక్కువ సీన్లు చేయలేకపోతున్నారట!

shooting troubles for chiranjeevi
Highlights

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యయనాన్ని లిఖించుకున్నాడు మెగాస్టార్ 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యయనాన్ని లిఖించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమానులు ఆరాధించే చిరంజీవి కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న 'సై.. రా' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఈ వయసులో ఆయనకు ఇటువంటి సినిమాలో నటించడం కష్టంగా మారిందని అంటున్నారు. వ్యాయామాలు చేస్తూ ఆయన తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకున్నప్పటికీ రోజులో మాత్రం ఎక్కువ సీన్లు చేయలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఒక సీన్ చేసిన వెంటనే అలిసిపోయి విశ్రాంతి తీసుకొని మరో సీన్ కు వెళ్తున్నారని చెబుతున్నారు. అందుకే షూటింగ్ సమయంలో ఎక్కువగా గ్యాప్ తీసుకుంటున్నారట. దీంతో మధ్యలో దర్శకుడు వేరే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యన ఆయన లుక్ కూడా మారినట్లు అనిపిస్తోంది.

సినిమా ప్రారంభించే ముందు ఉన్న కల ఇప్పుడు ఆయన ముఖంలో కనిపించడం లేదు. రీసెంట్ గా తేజ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా ఆయన ముఖం ఉబ్బినట్లుగా కనిపించింది. చిరంజీవి మాత్రం ఈ ఏడాదిలోనే సైరాలో తన పార్ట్ పూర్తి చేసి కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.   

loader