అడల్ట్ మ్యాగజైన్ ప్లే బాయ్ లో న్యూడ్ గా ఫోజులిచ్చిన తొలి ఇండియన్ నటి షెర్లిన్ చోప్రా. ఆ తర్వాత షెర్లిన్ చోప్రా కామసూత్ర3డి చిత్రంలో నటించిన సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో చెరిగిపోయే షెర్లిన్ అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ పై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. కానీ అలాంటి విమర్శలని తాను పట్టించుకోనని షెర్లిన్ అంటోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో షెర్లిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అడల్ట్ చిత్రాల్లో అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. గ్లామర్ షో, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వరకు అయితే ఒకే. కానీ కెమెరా ముందే విచ్చలవిడిగా శృంగారం అంటే కష్టమే. అలా నటించడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అని షెర్లిన్ చోప్రా తెలిపింది. 

గ్లామర్ ఫోటో షూట్స్ చేసినంత మాత్రాన అలాంటి చిత్రాల్లో అవకాశం వస్తుందని అనడం సరికాదు. ఇలాంటి డ్రస్సులే వేసుకోవాలి.. ఎక్స్ ఫోజింగ్ చేయకూడదు అనే నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా ని షెర్లిన్ ప్రశ్నించింది. బోల్డ్ ఫోటో షూట్స్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు దీనిని వివాదం చేయడం ఎందుకు అని షెర్లిన్ అంటోంది.