బ్యాంకింగ్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు.. ఈ నెలలో మారనున్న రూల్స్ ఇవే..
ప్రతినెల 1 తేదీన కొన్ని రూల్స్ మారుతుంటాయి. అలాగే మారుతున్న రూల్స్ మన సేవింగ్స్ లేదా ఖర్చులపై ప్రభావం చూపవచ్చు.
ఈ నెల జూలైలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సహా ఇతర రంగాల వంటి ఆర్థిక విషయాలను కవర్ చేస్తూ ఎన్నో రూల్స్ మారబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ మీ ఖర్చులు ఇంకా సేవింగ్స్ పై ప్రభావితం చూపవచ్చు. అయితే ఈ మార్పుల గురించి ముందుగా తెలుసుకోవడం ముఖ్యం లేకుంటే మీ జేబుకు బొక్కపడటం ఖాయం.
జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లు క్లోజ్ చేయనున్నట్లు Paytm పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌లో జీరో బ్యాలెన్స్‌తో ఇన్‌యాక్టివ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేయనున్న తేదీలను కూడా ప్రకటించింది.
"1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ట్రాన్సక్షన్స్ లేని అన్ని వాలెట్లు & జీరో బ్యాలెన్స్ సహా జూలై 20, 2024న మూసివేయనుంది. ఇక ICICI బ్యాంక్ జూలై నుండి రూ. 200 కార్డ్ స్విచ్చింగ్ ఫీజు వసూలు చేయబడుతుందని తెలిపింది.
జూలై 1, 2024 నుండి, విదేశీ చెక్ ప్రాసెసింగ్ ఫీజు చెక్ వాల్యూలో 1 శాతం ఉంటుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31.