Asianet News TeluguAsianet News Telugu

చెప్పాపెట్టకుండా నిన్న పెళ్లి చేసుకుందీ తెలుగు హీరోయిన్

ట్రెడిషనల్ గా క‌నిపిస్తూనే గ్లామ‌ర్‌తోనూ ఆక‌ట్టుకున్న ఈ పిల్ల.. ఒక్క సినిమాతోనే ఎంతోమందిని త‌న ఫ్యాన్స్ గా మార్చుకుంది. కెరీర్ లో క్లిక్ అయ్యాను కదా అనుకుందో ఏమో...ఈ అమ్మాయి ఉన్నట్టుంది నిన్న శుక్రవారం వివాహం చేసుకుంది.

Shalini Vadnikatti to married director Manoj Beeda
Author
Hyderabad, First Published Aug 22, 2020, 7:10 AM IST

హీరోయిన్ షాలిని వ‌డ్నిక‌ట్టి వివాహం చేసుకుంది. ఆమె ఎవరో గుర్తు వచ్చిందా...రీసెంట్ గా డైరక్ట్ ఓటీటి రిలీజ్ అయి హిట్ అయిన కృష్ణ అండ్ హిజ్ లీల‌ హీరోయిన్. ఆ సినిమాలో  రాధ క్యారక్టర్ కనిపించి అలరించిన కొత్త‌మ్మాయి షాలిని వ‌డ్నిక‌ట్టి. ట్రెడిషనల్ గా క‌నిపిస్తూనే గ్లామ‌ర్‌తోనూ ఆక‌ట్టుకున్న ఈ పిల్ల.. ఒక్క సినిమాతోనే ఎంతోమందిని త‌న ఫ్యాన్స్ గా మార్చుకుంది. కెరీర్ లో క్లిక్ అయ్యాను కదా అనుకుందో ఏమో...ఈ అమ్మాయి ఉన్నట్టుంది నిన్న శుక్రవారం వివాహం చేసుకుంది.

ఆమె వివాహం చేసుకున్న కుర్రాడు పేరు మ‌నోజ్ బీద. క‌రోనా రూల్స్ పాటిస్తూ... త‌క్కువ‌మంది గెస్ట్ లతో వీరి పెళ్లి జ‌రిగింది. ఇంతకీ మ‌నోజ్ ఏం చేస్తుంటాడు అంటారు. అతను  ఓ ద‌ర్శ‌కుడు. మనోజ్ ..త‌మిళంలో వంజ‌గ‌ర్ ఉలగం అనే సినిమా తీశాడు. జోక‌ర్ సినిమా ఫేమ్ గురు సోమసుంద‌రం ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఓ విభిన్న‌మైన సినిమాగా ఈ సినిమాకు పేరొచ్చింది. డబ్బు రాలేదు...దాంతో ఆ త‌ర్వాత మ‌నోజ్ నుంచి సినిమా రాలేదు. మన హీరోయిన్  షాలినితో కొన్నేళ్లుగా మ‌నోజ్ రిలేష‌న్‌షిప్‌లో ఉండి..వివాహం చేసుకున్నాడు. 

షాలిని విష‌యానికి వ‌స్తే.. ఆమె ప్ల‌స్ అనే క‌న్న‌డ సినిమాతో హీరోయిన్ గా ప‌రిచయం అయింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌తో పాటు త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో యురేక‌తో ఆమె హీరోయిన్ గా ప‌రిచయం అయింది. కానీ గుర్తింపు, పేరొచ్చింది మాత్రం కృష్ణ అండ్ హిజ్ లీల‌తోనే. 

Follow Us:
Download App:
  • android
  • ios