దీపావళి సంబరాలు తమిళ సినీ ప్రేక్షకులకు ఒక రోజు ముందే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ సర్కార్ సినిమా రేపే రిలీజ్ కానుంది గనుక. తుపాకీ - కత్తి లాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తరువాత మురగదాస్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు ఆకాశానికి చేరాయి. 

పక్క రాష్ట్రాల్లోనే సినిమా హడావుడి ఎక్కువగా ఉందంటే ఇక తమిళనాడులో ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. అభిమానులు 150అడుగుల కటౌట్స్ ఏర్పాటు చేసి విజయ్ మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. ఇక దీవాళికి తమిళనాడులో ఉన్న 90% థియేటర్స్ లలో సర్కార్ బొమ్మనే కనిపించనుంది. కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో విజయ్ సినిమా రిలీజ్ అవుతోంది. 

తమిళనాడులో రోజుకి ఆరు షోలను ప్రదర్శించడంతో సినిమా టాక్ బావుంటే ముందు రోజులల్లో కూడా అదే ఫార్మాట్ కొనసాగనుందని సమాచారం. ఇక అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా సినిమా అడ్వాన్స్ బుకింగ్ లలో కూడా రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పటికే 170k డాలర్స్ ని రాబట్టిన సర్కార్ మొదటి వారంలోనే ఊహించని కలెక్షన్స్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. మెర్సల్ చిత్రం మొత్తంగా 270k డాలర్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే. 

 

ఇవి కూడా చదవండి.. 

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!