MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?

పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఆయన అభిమానుల్లో సెలబ్రిటీలు కూడా ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో పవన్ క్లోజ్ గా ఉండే ముగ్గురు స్నేహితులు ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక వైపు పాలన.. మరోవైపు సినిమాలు..
Image Credit : Pawan Kalyan\Twitter

ఒక వైపు పాలన.. మరోవైపు సినిమాలు..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొంత కాలు పాలపై పట్టు వచ్చిన తరువాత.. తన పెండింగ్ సినిమాలు పూర్తి చేయడం స్టార్ట్ చేశారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం తన సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 ఇప్పటికే ఓజీ సినిమాతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన పవన్ కళ్యాన్.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

25
పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్..
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. మెగాస్టార్ ను మించి ఫాలోయింగ్ సాధించిన హీరో. పవన్ అంటే ఒక ఎమోషన్.. పవన్ అంటే ఒక సెంటిమెంట్.. పవన్ అంటే యూత్ పవర్ గా మారిపోయాడు. పవర్ స్టార్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఆయన కు ఉన్న డైమార్ట్ ఫాలోవర్స్ కోట్లలో ఉంటారు.

 అభిమానులంటే పవన్ కు ప్రాణం.. వారికోసం ఆయన చేసిన అద్భుతాలెన్నో. ఇక ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ ను అభిమానించనివారు ఉండరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం పవర్ స్టార్ కు ముగ్గరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారు ఎవరంటే?

Related Articles

Related image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Related image2
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
35
పవన్ సినిమాల్లో అలీ ఉండాల్సిందే?
Image Credit : our own

పవన్ సినిమాల్లో అలీ ఉండాల్సిందే?

పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కానీ అయనతో కలిసి ఎక్కవ కాలంగా ట్రావెల్ చేస్తున్నవారు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. వారిలో అలీ ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలీ పక్కన ఉండాల్సిందే. పవన్ పాత్ర పక్కనే అలీ కనిపించాల్సిందే. ఈ ట్రెండ్ ను ఇప్పుడు కాదు.. ఎన్నో ఎళ్లుగ్గా ఫాలో అవుతున్నారు.

 బద్రి, తమ్ముడు సినిమాల టైమ్ నుంచి.. అత్తారింటికి దారేది, కాటమరాయుడు వరకూ.. ప్రతీ సినిమాలో అలీ పవన్ పక్కన నటించాడు. ఆతరువాత వీరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు తెలిసింది. అలీ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం.. ఆతరువాత పవన్, అలీ మధ్య రాజకీయ వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ గ్యాప్ పెద్దదైనట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ వాతావరణం మారిపోయిందని కూడా తెలుస్తోంది.

45
త్రివిక్రమ్ తో అనుబంధం..
Image Credit : Facebook / trivikram

త్రివిక్రమ్ తో అనుబంధం..

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పవన్ పక్కన్న గురూజీ ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలతో త్రివిక్రమ్ ప్రభావం ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. ఇక పవర్ స్టార్ సినిమాల విషయంలో కూడా త్రివిక్రమ్ చేయి పడాల్సిందే. జల్సా సినిమా నుంచి వీరి బంధం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు, కథ అందించారు. దర్శకత్వ పర్యావేక్షణ కూడా చేశారు.

55
ఆనంద్ సాయి తో 30 ఏళ్ల స్నేహం..
Image Credit : instagram / Anand Sai,

ఆనంద్ సాయి తో 30 ఏళ్ల స్నేహం..

ఆనంద్ సాయి విషయానికి వస్తే.. ఈయన కూడా పవర్ స్టార్ కు మంచి మిత్రుడు. వీరు గత 30 ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఆనంద్ సాయి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన పాపులర్ ఆర్ట్ డైరెక్టర్. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్. 

ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆనంద్ సాయి.. సినిమాలు మానేసి.. ఆలయ నిర్మాణ పనుల్లోనూ భాగం అయ్యారు. యాదాద్రి టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్ గా.. దగ్గరుండి ఆలయ నిర్మాణ పనులు చూసుకున్నారు. 2013లో నాయక్ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం ఆలయాల నిర్మాణంలోనే స్థిపతిగా ఉంటున్నారు. 

పవన్, ఆనంద్ సాయి ఇద్దరూ 30 ఏళ్లుగా స్నేహితులు. గతంలో తొలి ప్రేమ, తమ్ముడు, జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, జల్సా వంటి ఎన్నో సినిమాలకు వీరు పనిచేశారు. ఈ ఇద్దరు కలిసి చివరిగా... 2010లో కొమురం పులి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image2
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Related Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved