MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలో చాలామంది సడెన్ తెరమరుగైపోతున్నారు. ఈమధ్య కాలంలో ఓవర్ నైట్ స్టార్ గా మారిన కార్తికేయ కూడా.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. ఆయన సడెన్ గా సినిమాలు ఎందుకు మానేశాడు? ఇప్పుడేం చేస్తున్నాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..
Image Credit : facebook.com/ActorKartikeya

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన హీరోల జాబితాలో కార్తికేయ కూడా ఒకడు. నాని, విజయ్ దేవరకొండ తరహాలో స్టార్ హీరోల లీగ్‌కు చేరువయ్యాడు కార్తికేయ గుమ్మకొండ. ఇలాగే వరుస సినిమాలతో పెద్ద స్థాయికి ఎదుగుతారని ఆడియన్స్ భావించారు. కానీ సడెన్ గా స్క్రీన్ నుంచి మాయమై షాక్ ఇచ్చాడు యంగ్ హీరో.. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
RX 100 సినిమాతో సంచలం..
Image Credit : facebook.com/ActorKartikeya

RX 100 సినిమాతో సంచలం..

RX 100 చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో కార్తికేయ కటౌట్ చూసి..మరో ప్రభాస్ వచ్చాడని ఆడియన్స్ మురిసిపోయారు. నాని.. విజయ్ దేవరకొండ స్థాయికి ఎదుగుతారని సినీ వర్గాలు అంచనా వేశాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఆయన హీరోగా నటించిన గుణ 369, 90ML, బెదురులంక 2012 చిత్రాలు కమర్షియల్‌గా మంచి ఫలితాలను అందుకున్నాయి.

Related Articles

Related image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Related image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
35
విలన్ గా మెప్పించిన యంగ్ స్టార్..
Image Credit : facebook.com/ActorKartikeya

విలన్ గా మెప్పించిన యంగ్ స్టార్..

కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా, విలన్ పాత్రల్లోనూ తన ప్రతిభను చూపించారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని హీరోగా నటించగా, కార్తికేయ విలన్ గా రచ్చ రచ్చ చేశాడు. . అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో కూడా విలన్‌గా నటించి గుర్తింపు పొందారు.

 ప్రేక్షకులకు దగ్గరవుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా సినిమాల నుండి దూరమయ్యారు. కార్తికేయ చివరిసారిగా కనిపించిన చిత్రం భజే వాయు వేగం. ఈ చిత్రం 2024లో విడుదలై యావరేజ్ గా నిలిచింది.

45
సడెన్ గా మాయమైన హీరో..
Image Credit : facebook.com/ActorKartikeya

సడెన్ గా మాయమైన హీరో..

ఆ సినిమా తరువాత ఆయన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక ట్వీట్ చేశారు. అందులో, “నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. 

మీ ఆశీస్సులే నా బలం. అందరూ నా తదుపరి చిత్రం ఏంటి అని అడుగుతున్నారు. మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. వర్క్ ప్రోగ్రెస్‌లోనే ఉంది. కాస్త ఓపిక పట్టండి, బ్లాస్టింగ్ అప్డేట్‌తో మీ ముందుకొస్తాను” అని పేర్కొన్నారు.

55
వ్యక్తిగత కారణాల వల్ల..?
Image Credit : facebook.com/ActorKartikeya

వ్యక్తిగత కారణాల వల్ల..?

కార్తికేయ కుటుంబానికి కొన్ని బిజినెస్ లు కూడా ఉన్నట్టు సమాచారం. ఆయన ఆ పనులు చక్కదిద్దే హడావిడిలో ఉన్నాడా? ఒకటి మాత్రం నిజం.. యంగ్ హీరో సినిమాలను పూర్తిగా వదిలేయలేదని మాత్రం స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా లేదా వ్యక్తిగత కారణాల వల్ల తాత్కాలిక విరామం తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ యంగ్ స్టార్ త్వరలోనే బలమైన ప్రాజెక్ట్‌తో తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
నాని (నటుడు)
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Recommended image2
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image3
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved