కరోనా నిబంధనలు దాటుకుని బిగ్‌బాస్‌ సందడి షురూ అవుతుంది. ఇప్పటికే తెలుగులో `బిగ్‌బాస్‌` నాల్గో సీజన్‌ ప్రారంభమైంది. సందడిగా సాగుతుంది. అక్టోబర్‌లో తమిళ బిగ్‌బాస్‌4 షురూ కాబోతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బిగ్‌బాస్‌ కూడా రంగంలోకి దిగబోతున్నాడు. 

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ గా సాగే బిగ్‌బాస్‌ సీజన్‌ 14 త్వరలో రాబోతుంది. అక్టోబర్‌ 3 నుంచి కొత్త సీజన్‌ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమోని కలర్స్ టీవీ ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. మాస్క్‌ పెట్టుకుని చేతులకు, కాళ్లని గొలుసులతో కట్టేయగా, దాన్ని బిగ్‌బాస్‌ తెంచుకుని వచ్చి ఆనందం పంచుతాననడం ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ని ఎవరూ ఆపలేరు అనే అర్థంలో రూపొందించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. 

అక్టోబర్‌ 3న బిగ్‌బాస్‌ 14 ప్రారంభం కానుందని తెలిపారు. ఇది రెగ్యూలర్‌గా రాత్రి 10.30పీఎంకి ప్రసారం కానుంది. శని, ఆది వారాల్లో తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. కొత్త సీజన్‌ కంటెస్టెంట్లుగా అధ్యాయన్‌ సుమన్‌, వివియన్‌ ద్సేనా, నియా శర్మ, నిర్మాత ఒనిర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో సల్మాన్‌ పారితోషికం భారీగా తీసుకోబోతున్నారట. ఏకంగా రూ.16కోట్లు ఒక్కో సీజన్‌కి డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.