బుధవారం విడుదలైన సైరా ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ అప్పియరెన్స్, సురేందర్ రెడ్డి టేకింగ్, గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ కంటెంట్ ఇలా అన్ని అంశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అన్ని భాషల్లో సైరా ట్రైలర్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. 

తెలుగు సినీ ప్రముఖలంతా సైరా ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే సైరా ట్రైలర్ ని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా రాంచరణ్, చిరంజీవికు శుభాకాంక్షలు తెలిపాడు. 

సల్మాన్ ఖాన్, రాంచరణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పలు సందర్భాల్లో చిరు ఫ్యామిలీని సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా కలుసుకున్నాడు. సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి డబ్బింగ్ చెప్పింది చరణే. 

సైరా ట్రైలర్ కు సల్మాన్ ఖాన్ ప్రమోషన్ కల్పించడంతో ఈ చిత్రం నార్త్ లో మరింతగా ప్రజల్లోకి వెళుతుందనడంలో సందేహం లేదు. సైరా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. 

బిగ్ బి అమితాబ్ ఈ చిత్రంలో నటిస్తుండడం నార్త్ లో మార్కెట్ పరంగా సైరా చిత్రానికి పెద్ద ప్లస్. ఇక కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణం సైరా చిత్రంలో నటించారు.