పవన్ కళ్యాణ్ మాజీ భార్య ,నటి రేణు దేశాయ్..సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు, ఆలోచనలను షేర్ చేసుకుంటూంటారు. కేవలం సినిమాలు మాత్రమే కాక, సామాజిక విషయాలను కూడా ఆమె చర్చిస్తూంటారు. తాజాగా ఆమె కరోనా వ్యాప్తి, జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. అలాగే ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అదే సమయంలో తన అభిమానులు అడిగిన ప్రశ్నకు..తన కుమార్తె  యాక్టివిటీస్ అన్ని చెప్పుకొచ్చారు. ఇక మరో అభిమాని పింక్ రీమేక్ లాయిర్ సాబ్ లో మీరు చేస్తున్నారా అడిగారు. దానికి ఆమె ఇది పెద్ద రూమర్. ఎవరు అంత ఖాళీగా ఉండి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో అని కోప్పడ్డారు. 
 
లాయిర్ సాబ్ విషయానికి వస్తే...పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాని మే 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 

ఈ నేపధ్యంలో ... ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ కీలకపాత్రలో కనిపించనుందని రూమర్ మొదలైంది. దాన్నే ఇప్పుడు రేణు ఖండించారన్నమాట. ఇక పవన్ , రేణు దేశాయ్ మొదటిసారిగా బద్రి సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత జానీ సినిమాతో జోడీ కట్టారు. ఇక ఈ జంట మళ్ళీ కనిపించింది లేదు. ఇక ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం చేసారు. కానీ అది అబద్దమని తేలిపోయింది.