Asianet News TeluguAsianet News Telugu

రవిబాబు 'ఆవిరి'.. మరోసారి దెయ్యాన్నే నమ్ముకున్నాడు!

టాలీవుడ్ లో ఉన్న వైవిధ్యమైన దర్శకుల్లో రవిబాబు ఒకరు. గతంలో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా చేయలేకపోయారు.

ravibabu 'aaviri' movie first look poster
Author
Hyderabad, First Published Jan 1, 2019, 2:34 PM IST

టాలీవుడ్ లో ఉన్న వైవిధ్యమైన దర్శకుల్లో రవిబాబు ఒకరు. గతంలో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా చేయలేకపోయారు. 'అదిగో' అంటూ ఓ పంది పిల్లను పెట్టి సినిమా తీశారు.

అది కూడా బోల్తా కొట్టింది. దెయ్యం సినిమాలను తెరక్కించడంలో తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసిన రవిబాబు మరోసారి అదే జోనర్ ని నమ్ముకున్నాడు. 'ఆవిరి' అనే పేరుతో సినిమా తీయబోతున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశాడు. ఓ బాటిల్ దాంట్లో బంధించిన ఆత్మ స్టిల్ ని వదిలారు. పోస్టర్ చూడడానికి ఆసక్తిగానే ఉన్నా.. మేకింగ్ ఎలా ఉంటుందో మరి. ఈ సినిమాతో అయినా.. రవిబాబు సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం!

Follow Us:
Download App:
  • android
  • ios