దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి సిద్ధమౌతున్న సంగతి తెలెసిందే. రానా, మిహికా బజాజ్ ల వివాహానికి రంగం సిద్దమైంది. ఇటీవ‌ల రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  కరోనా లేకపోతే..సంబరాలు ఓ స్దాయిలో ఉండేవి. కరోనా లాక్ డౌన్ తర్వాత..గ్రాండ్ గా వివాహం జరపాలని దగ్గుబాటి ఫ్యామిలీ ఆలోచించింది. కానీ ఆ విషయమై ప్రస్తుతానికి ప్రభుత్వాల నుంచి క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో తమ పని తాము చేసుకుపోతున్నారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ 8న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే ఈ వార్తలపై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 

ఇక ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ ను ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా రానా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిహికాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. హైదరాబాద్ చెందిన బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. ఆమె చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో రాణించడంతో..డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతోంది. 

రానా తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఈ వివాహంపై మీడియాతో మాట్లాడుతూ... తన కుమారుడు రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసునని చెప్పారు. జీవితంలో ఒకటి కావాలని అనుకోవడం సంతోషకరమని, వివాహానికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో చెబుతామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి జరిగే అవకాశం ఉందని అన్నారు. అంతకు ముందే కూడా జరగవచ్చునని అన్నారు. అన్ని విషయాలు ఖరారైన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామన్నారు.