Asianet News TeluguAsianet News Telugu

అదిరిందయ్యా ఆర్జీవీ, కొత్త పిల్లతో కొత్త ఏడాది పండగే..? ఇంతకీ ఎవరా అమ్మాయి...?

రామ్ గోపాల్ వర్మ.. న్యూ ఇయర్ ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చాలామంది ఇంట్రెస్టింగ్ గా  గమనించారు. అందరూఅనుకున్నట్టే.. కొత్త అమ్మాయితో.. డాన్స్ లు.. పబ్ లో హడావిడితో కొంగొత్త ఏడాకి వెల్కం చెప్పారు ఆర్జీవీ. 

Ram Gopal varma New Year Celebration with New Lady Siri Stazie Viral Pics JMS
Author
First Published Jan 2, 2024, 11:12 AM IST

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది చేసినా వెరైటీనా.. ఎప్పుడు ఎవరి గురించి ఎలా స్పందిస్తాడో ఆయనకే తెలదు. మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఆయన మాటలు, చేస్టలు చాలామందికి ఇబ్బందికరంగా ఉంటాయి. తొడలు మెడలు అంటూ..  ఆర్జీవీ చేసే పనులు కొన్ని అబ్బో.. చెప్పడం ఎందుకులేండి. ఆయన  గురించి అందరికి తెలిసిందే. నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చిన పనులు చేస్తాడు. ఇక కుదిరినప్పుడల్లా పార్టీల్లో మునిగి తేలుతుంటాడు. 

ఈక్రమంలోనే ఆయన ఒక్కోసారి ఒక్కో కొత్త అమ్మాయిని పరిచయం చేసి వాళ్ళు ఇండస్ట్రీలో  పాపులర్ అయ్యేలా చేస్తుంటాడు. ఇప్పటికే ఆర్జీవీ ఇండస్ట్రీలో చాలా మందిని సెలబ్రిటీలను చేశాడు. అష్షురెడ్డి, అరియానా, ఇనయాసుల్తానా లాంటివారు చాలామంది ఈలిస్ట్  లో ఉన్నారు. ఇక తాజాగా ఆర్జీవీ తన న్యూ ఇయర్ పార్టీ వేడుకల వేదికగా మరో అమ్మాయిని ఫేమస్ చేశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. 

తాజాగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్న రామ్ గోపాల్ వర్మ. ఆ వీడియోలు, ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎప్పటిలాగే ఓ అమ్మాయితో బాగా రచ్చ చేస్తూ న్యూ ఇయర్ పార్టీలో ఎంజాయ్ చేశాడు ఆర్జీవీ. దీంతో ఆ అమ్మాయి కూడా వైరల్ అయిపోయింది. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయి వీడియో ఒకటి షేర్ చేసి నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా. అంటూ ఈమె అని ఆమెకు సబంధించిన సోషల్ మీడియా పేజ్ ను కూడా ట్యాగ్ చేసి వదిలిపెట్టాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

ఏదో కావాలని పెయిడ్ ప్రమోషన్ చేసేవారిలా.. రామ్ గోపాల్ వర్మ... తనకుఉన్న ఫేమ్.. ఇమేజ్ తో.. ఇలా అమ్మాయిలను ఇండస్ట్రీలో హైలెట్ చేస్తూ వస్తున్నాడు. అయితే వారితో మనోడు చేసే ఇంటర్వ్యూలు, పబ్ లో డాన్స్ లు మాత్రం ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఇక ఇంతకీ ఆర్జీవీతో ఆడిపాడిన ఈ బ్యూటీ ఎవరంటేు..  ఆమె పేరు సిరి స్టేజి. అసలు పేరు ఇదో కాదో తెలీదు కానీ సోషల్ మీడియాలో కొసరు పేరు మాత్రం ఇదే పెట్టుకుంది ఈ భామ.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Siri (@siri_stazie)

ఆల్రెడీ ఈ సిరి స్టేజి అనే అమ్మాయి గతంలో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ అప్పుడే సిరి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి ఆర్జీవీతో పార్టీలో కలిసి రచ్చ చేసి పాపులర్ అవుతోంది. ఈ సిరి స్టేజి ఆర్జీవీ ఫ్యాన్ అని గతంలో చెప్పింది. నటిగా అవకాశాలు ట్రై చేస్తుంది. ఓ సినిమాలో నటించిన సిరి ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. మరి ఆర్జీవీ పుణ్యమా అని ఈ పాపులారిటీతో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios