Asianet News TeluguAsianet News Telugu

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంకకి `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్ డే విషెస్‌

నటిగానే కాదు, సింగర్‌గా, రైటర్‌గా, నిర్మాతగా మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్న ప్రియాంక బర్త్ డే నేడు. ఈ ఆదివారం ఆమె తన 39వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. రామ్‌చరణ్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు.

ram charan birthday wishes to globle beauty priyanka chopra  arj
Author
Hyderabad, First Published Jul 18, 2021, 5:46 PM IST

తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ఇప్పుడు గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తుంది ప్రియాంక చోప్రా. బీహార్‌కి చెందిన ఈ అందాల భామ హాలీవుడ్‌లో సత్తా చాటుతుంది. మన ఇండియన్‌ ఆర్టిస్ట్ గా ఇంగ్లీష్‌ చిత్రాల్లో రాణిస్తుంది. ఊహించని మలుపులతో సాగిన తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది ప్రియాంక. నటిగానే కాదు, సింగర్‌గా, రైటర్‌గా, నిర్మాతగా మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్న ప్రియాంక బర్త్ డే నేడు. ఈ ఆదివారం ఆమె తన 39వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. 

ఈ సందర్భంగా అనేక మంది హాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకి పుట్టిన రోజు విషెస్‌ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌ తన ఆన్‌స్క్రీన్‌ జోడి ప్రియాంకకి బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. `పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియాంక చోప్రా. ఈ ఏడాది మీకు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా `జంజీర్‌` సినిమా టైమ్‌లో వాళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు రామ్‌చరణ్‌. వీరిద్దరు కలిసి `తుఫాన్‌`(హిందీలో `జంజీర్‌`) చిత్రంలో నటించారు. తెలుగు, హిందీలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాతో రామ్‌చరణ్‌ హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆదరణ పొందలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్‌ వైపు చూడలేదు చరణ్‌. 

ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మరోవైపు రామ్‌చరణ్‌ తెలుగులో `ఆర్ఆర్‌ఆర్‌`,`ఆచార్య` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios