Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసు :ఈడీ అధికారులకు రకుల్ రిక్వెస్ట్,ఈ రోజే విచారణ

ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు.

Rakul requests extension of her questioning
Author
Hyderabad, First Published Sep 3, 2021, 9:10 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈడీ విచారణను ముమ్మురం చేసింది. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను అధికారులు ప్రశ్నించగా.. నిన్న నటి, నిర్మాత ఛార్మిని విచారించారు. కాగా... రకుల్ ప్రీత్ ఈ నెల 6న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరుకావలసి ఉంది. అయితే వరుస షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నానని.. కొంత గడువు ఇవ్వాలని అధికారులను కోరిందట. 

వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్‌ లేఖరాశారు. ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్‌ అధికారులు విచారించిన సినీ ప్రముఖల జాబితాలో రకుల్‌ పేరు లేదు. కెల్విన్‌కు ఆమె నగదు పంపించినట్లుగా ఈడీ ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారమే నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.

ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్‌‌ 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కీలక విషయాలపై 10 గంటలపాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే  ఛార్మీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్‌ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.

ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ విచారిస్తోంది. గతంలో ఎక్సైజ్ అధికారుల ముందు తనకెమి తెలియనట్టు చెప్రి డ్రామా ఆడిన డ్రగ్ డీలర్ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కేసులో అలెర్ట్ అయ్యాడు. ఈడీ కేసుతో అప్రూవల్‌గా మారాడు. దాంతో సినీమా వాళ్ల చిట్టాను ఈడీకి ఇచ్చాడు డ్రగ్ డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ సమాచారంతోనే సినీ తారాలకు నోటీసులు ఇచ్చింది. కెల్విన్ బ్యాంకు ఖాతాలోకి భారీగా పంపినట్టు ఈడీ గుర్తించింది. కెల్విన్ స్టేట్‌మెంట్ ఆధారంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది.

కెల్విన్ బ్యాంకుకు డబ్బులు పంపిన సినీ తారల బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేసే ఆలోచనలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ మాటున నిధుల అక్రమ మళ్లింపు ఏదైనా జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఈడీ డ్రగ్స్‌ కేసును అవకాశంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22 వరకూ జరిగే విచారణలో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. వారి ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios