మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ యాక్షన్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్  దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ఈ ఐటెం సాంగ్ లో రకుల్ తో స్టెప్పులు వేయించాలని ప్లాన్ చేశారు.

కానీ దీనికి ఆమె అంగీకరించలేదట. తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ బిజీగా ఉన్నాను.. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేయలేను అంటూ తేల్చి చెప్పిందట. దీంతో ఐటెం సాంగ్ చేయలేనంత బిజీగా రకుల్ ఏంలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఐటెం సాంగ్ లో నటించడం ఇష్టం లేని కారణంగానే ఆమె రిజెక్ట్ చేసిందని టాక్.

దీంతో బోయపాటి బాలీవుడ్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే చరణ్ తో గతంలో రెండు సినిమాలు చేసిన రకుల్ ఇప్పుడు ఐటెం సాంగ్ కి నో చెప్పడంతో అభిమానులు మండిపడుతున్నారు. తెలుగులో ఆమెకి అవకాశాలు లేని క్రమంలో ఈ ఐటెం సాంగ్ లో నటించి ఉంటే కెరీర్ కి ప్లస్ అయి ఉండేదేమోననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!