MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Star Child: క్రికెట్‌ ఆడుతున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇంటర్నేషనల్‌ బాక్సాఫీసుపై కన్నేసిన హీరో

Star Child: క్రికెట్‌ ఆడుతున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇంటర్నేషనల్‌ బాక్సాఫీసుపై కన్నేసిన హీరో

Star Child: ఈ ఫోటోలో క్రికెట్‌ ఆడుతున్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఒక్క పాన్‌ ఇండియా మూవీ కూడా చేయలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్‌పై ఆయన కన్నేవారు. గ్లోబల్‌ ఫిల్మ్ తో బిజీగా ఉన్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 17 2026, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రికెట్‌ ఆడుతున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
Image Credit : Facebook/@maheshbabu.universe

క్రికెట్‌ ఆడుతున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

స్టార్స్ చిన్నప్పుడు చేసే పనులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అభిమానులను అలరిస్తాయి. అవి చూసినప్పుడు ఎంతో హ్యాపీ అవుతారు. స్టార్‌ లకు సంబంధించిన ప్రతి మూమెంట్‌ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఓ స్టార్‌ హీరో చిన్నప్పటి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ బాక్సాఫీసుపై కన్నేసిన ఈ హీరో ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ఆ హీరో ఎవరనేది చూస్తే,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆ కుర్రాడే మహేష్‌ బాబు
Image Credit : Facebook/@maheshbabu.universe

ఆ కుర్రాడే మహేష్‌ బాబు

చిన్నప్పుడు ఇంటి ముందు క్రికెట్‌ ఆడుతున్న కుర్రాడు ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. సూపర్ స్టార్‌ కృష్ణ తనయుడిగా, బాలనటుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్..ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ఆయన `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. చిన్నప్పటి అరుదైన మహేష్‌ బాబు ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.

36
తండ్రి కృష్ణతో మహేష్‌ బాబు అరుదైన ఫోటోలు
Image Credit : Facebook/@maheshbabu.universe

తండ్రి కృష్ణతో మహేష్‌ బాబు అరుదైన ఫోటోలు

ఇందులో మహేష్‌ బాబు ఎంతో క్యూట్‌గా ఉన్నాడు. ఓ ఫోటోలో క్రికెట్‌ ఆడుతూ కనిపించగా, మరో ఫోటోలో కృష్ణుడి వద్ద నవ్వుతూ ఉన్నాడు. అమాయకమైన ఫేస్‌, చిరునవ్వుతో మహేష్‌ ఎంతో బాగున్నాడు. ఇక మిగిలిన ఫోటోస్‌లో తండ్రి కృష్ణతో కలిసి ఉన్నాడు. ఈ అరుదైన ఫోటోలను అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. దీంతో తెగ ఆకట్టుకుంటున్నాయి.

46
నీడ మూవీతో బాలనటుడిగా పరిచయం అయిన మహేష్‌ బాబు
Image Credit : Facebook/@maheshbabu.universe

నీడ మూవీతో బాలనటుడిగా పరిచయం అయిన మహేష్‌ బాబు

మహేష్‌ బాబు 1979లో `నీడ` చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. దాదాపు 9 సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. 1999లో `రాజకుమారుడు` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రం ఫర్వాలేదనిపించింది. `మురారి`తో విజయాన్ని అందుకున్నారు. `ఒక్కడు` మూవీతో కమర్షియల్‌ బ్రేక్‌ అందుకొని స్టార్‌ అయ్యాడు. `అర్జున్‌`, `అతడు`, `పోకిరి` మహేష్‌ కెరీర్‌ని మార్చేశాయి. `పోకిరి`తో సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు మహేష్‌.

56
సూపర్‌ స్టార్‌గా ఎదిగిన మహేష్‌
Image Credit : Facebook/@maheshbabu.universe

సూపర్‌ స్టార్‌గా ఎదిగిన మహేష్‌

`దూకుడు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `శ్రీమంతుడు`, `భరత్‌ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`, `సర్కారు వారి పాట` వంటి చిత్రాలతో అలరించారు. చివరగా `గుంటూర కారం`తో మెప్పించిన ఆయన ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

66
`వారణాసి`తో రాబోతున్న మహేష్‌ బాబు
Image Credit : Facebook/@maheshbabu.universe

`వారణాసి`తో రాబోతున్న మహేష్‌ బాబు

మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రమిది. టైమ్‌ ట్రావెల్‌, హిస్టారికల్‌ నేపథ్యం, మైథాలజీ అంశాలను మేళవించి ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రమిది. మహేష్‌ ఇందులో రుద్ర అనే సాహసికుడిగా కనిపిస్తాడు. ఆయన వివిధ లోకాలకు తిరిగి వస్తాడని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Related Stories
Recommended image1
Sunil: రెండో పెళ్లి చేసుకోకుండా సునీల్‌ అమ్మ చేసిన సాహసం.. స్టార్‌ కమెడియన్‌ జీవితమే మారిపోయిన సందర్భం
Recommended image2
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved