తెలంగాణా ఎలెక్షన్స్ లో భాగంగా సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సీనియర్ నటుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్  వంటి హీరోలతో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, నితిన్ ఇలా చాలా మంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 

ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సెలబ్రిటీలు వెల్లడించారు. తాజాగా సినీ కథా రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఫిల్మ్ నగర్ లో ఓటు వేశారు.

అలానే ప్రముఖ దర్శకుడు రాజమౌళి షేక్ పేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల అతడి భార్య సికింద్రాబాద్ లోని పద్మానగర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలానే సీనియర్ నటుడు చలపతిరావు, హీరో శ్రీకాంత్ 
కుటుంబం పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటేశారు. 

 

భారీ క్యూలో నిల్చున్న ఎన్టీఆర్!

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి!

ఓటేసిన వెంకటేష్, నితిన్!

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి