ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆపద్ధర్మ మంత్రి, సిద్ధిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం 7గంటలకు హరీష్ రావు సిద్ధిపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు తప్పకుండా తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే.. మంచి ప్రభుత్వం రావాలంటే.. మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో.. 90శాతం పోలింగ్ నమోదౌతుండగా.. పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదౌతోందని ఆయన అన్నారు. 

కాబట్టి విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు తమ అమూల్య మైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. 

read more news

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి