తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిల్చొన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

Scroll to load tweet…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వృద్ధులు మరణించారు. వరంగల్ నగరానికి చెందిన పరమాండ్ల స్వామి అనే వ్యక్తి ఓటేసేందుకు పైడిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు వచ్చాడు.

Scroll to load tweet…

క్యూలైన్‌లో వేచి ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. వెంటనే అప్రత్తమైన తోటి ఓటర్లు, పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గండ్రాంపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు క్యూలైన్‌లో నిలబడ్డాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురవ్వడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

ఉదయం 11 గంటల వరకు 23.17 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 22 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు ఓటు వేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ఈవీఎంలు మొరాయించడం వంటి సమస్యలు తలెత్తాయి.

అయితే సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో ఇప్పుడు ఎక్కడా సమస్యలు లేవని ఎన్నికల సంఘం ప్రకటించింది. సమయం గడిచేకొద్దీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలింగ్ బూత్‌ల వద్ద భారీ క్యూలైన్లు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 9.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

Scroll to load tweet…

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ ప్రారంభించిన తర్వాత సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. అప్పటికే చాలామంది క్యూలైన్లో వేచి ఉండటంతో ఒక్కొక్కరిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

Scroll to load tweet…

అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. కూకట్‌పల్లిలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు క్యూలైన్లోనే వేచివున్నారు. అలాగే అంబర్‌పేట్‌లో ఈవీఎంలు మొరాయించడంతో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ క్యూలైన్‌లో నిరీక్షిస్తున్నారు.

Scroll to load tweet…

అందుబాటులో ఉన్న నిపుణులు సాంకేతిక లోపాన్ని సవరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.

Scroll to load tweet…

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు. దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.

Scroll to load tweet…

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

Scroll to load tweet…