తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు మొదలైన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున, అమల, అల్లు అర్జున్ వంటి తారలు జూబ్లిహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో నితిన్ జూబ్లిహిల్స్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి