తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ మొదట్లోనే ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. భూపాలపల్లిలోని జడ్పీహెచ్ఎస్ లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు మొరాయించాయి. ఇప్పటి వరకు మాక్ పోలింగ్ కూడా ప్రారంభం కాలేదు. దీంతో.. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎంత సేపు ఎదురు చూడాలంటూ.. ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాగా.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

read more news here

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి