తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం మొదలైంది. తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, సిద్ధిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం ఏడుగంటల సమయంలో సిద్దిపేట పోలింగ్ బూత్ నెంబర్ 107లో హరీష్ రావు.. తన భార్య తో కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 9నుంచి 10గంటల మధ్యలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయన సిద్ధిపేటలోని చింతమడక గ్రామంలో ఓటు వేయనున్నారు.

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

"

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్