బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తెలుగు వారికి కూడా సుపరిచితమే. సినిమాలకు సంబంధించిన వార్తల కంటే తన బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారి తీసినా.. ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోదు.

రాధికకి న్యూడ్ సీన్స్ లో నటించడం కొత్తేమీ కాదు.. మూడేళ్ల క్రితం అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'మ్యాడ్లీ' అనే షార్ట్ ఫిలింలో రాధికా నగ్నంగా కనిపించింది. అప్పట్లో లీక్ అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది.

ఆ తరువాత 'పార్చ్ డ్' సినిమాలో మరోసారి న్యూడ్ సీన్స్ లో నటించింది. అప్పట్లో ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో కూడా రాధికా న్యూడ్ వీడియో బాగా షేర్ అయింది. తాజాగా వీటి గురించి ఓ షోలో మాట్లాడింది రాధికా ఆప్టే.

''నా అసలు లీక్స్ గురించి తెలియదు. మా అమ్మ చెప్పింది. ఎవరో న్యూడ్ వీడియోని అమ్మకి పంపారట. దాంతో షాక్ అయ్యాను. మొదటిసారి అలా జరగడంతో పిచ్చెక్కినట్లైంది. ఆ తరువాత నా డ్రైవర్ కూడా లీక్ అయిన క్లిప్స్ గురించి చెప్పాడు. ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి అలాంటి వాటి గురించి పట్టించుకోవడం మానేశా'' అంటూ చెప్పుకొచ్చింది.