Asianet News TeluguAsianet News Telugu

ఐటమ్ గర్ల్ గా రాశి ఖన్నా.. రాజాది గ్రేట్ లో..

  • వర్థమాన హిరోయిన్లలో ముందున్న రాశిఖన్నా
  • ఎన్టీఆర్ జై లవకుశ తో రాశిఖన్నాకు క్రేజ్
  • రవితేజ రాజా ది గ్రేట్ లో రాశిఖన్నా ఐటమ్ నంబర్
raashi khanna special item song in raja the great

తెలుగు హిరోయిన్స్ లో ఇటీవల అప్ కమింగ్ హిరోయిన్స్ హవా పెరిగింది. వీళ్లలో కొంత మంది వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే మరి కొందరికి సక్సెస్ వచ్చినా ఫేమ్ రావట్లేదు. ఇక వర్థమాన హిరోయిన్ రాశీ ఖన్నా ఇప్పటి వరకు చాలానే సినిమాలే చేసినా అనుకున్నంత క్రేజ్ రాలేదు. ఇప్పుడు ‘జై లవ కుశ’ లాంటి భారీ చిత్రంలో నటించడంతో రాశీ పేరు మారుమోగుతోంది. ప్రస్తుతం రాశీ చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. ఓవైపు ‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ సరన నటిస్తూనే మరోవైపు రవితేజతో ‘టచ్ చేసి చూడు’, మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తోంది. అలాగే తమిళం, మలయాళంలో ఒక్కో సినిమాతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో అవకాశం కొట్టేసింది.



మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని రాశీ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఫేస్‌బుక్ లో ఓ పోస్టు పెట్టింది. ‘నా లవ్‌లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం రవితేజ, మెహ్రీన్ పిర్జాడా జంటగా నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’లో ఓ పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నా’ అని రాశీ పోస్టు చేసింది.
 

అయితే ఆ పాట ఐటమ్ సాంగ్ అని టాక్. రాశీ ఐటమ్ సాంగ్ సినిమాకు ప్లస్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రాశీ ఖన్నా కెరీర్లో చెప్పుకోదగిన మంచి సినిమాల్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్’ ఒకటి. కాబట్టి అనిల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగానే రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్‌కి ఒప్పుకున్నట్లు సమాచారం.

 

‘రాజా ది గ్రేట్’లో రవితేజ అంధుడిగా వెరైటీ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ తల్లిగా ప్రముఖ నటి రాధిక నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌ నెలలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios