పూరీ జగన్నాత్‌ రెగ్యూలర్‌గా ఒక్కో విషయంపై తనదైన కోణంలో వివరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలను అభిమానులతో పంచుకుంటున్నారు. తన ఫిలాసఫీని చెబుతున్నారు. ఇప్పటికే భార్యలు, గోల్స్, సెక్స్, ప్రేమ, పరాజయం వంటి అనేక విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

తాజాగా పూరీ జగన్నాథ్‌ బుధవారం `బకెట్‌ లిస్ట్` పేరుతో మరో ఆలోచనని పంచుకున్నారు. ప్రపంచం చాలా ఉందని. అడ్వెంచర్‌ చేయమని చెబుతున్నారు. ఒంటరిగా తిరిగాలని కండీషన్‌ పెట్టారు. గోల్స్ పెట్టుకుని సాధించాలని, అలాగే బకెట్‌ లిస్ట్ పెట్టుకుని ఒక్కొక్కటిగా తిరగాలని చెబుతున్నాడు. అంతేకాదు ఇవన్నీ చూడటం కంటే పీకేది ఏం లేదని తనదైన స్టయిల్‌లో పంచ్‌ వేశారు. 

పూరీ జగన్నాథ్‌ తన మ్యూజింగ్‌లో చెబుతూ, నీ గోల్స్ ని, నీ డ్రీమ్స్ ని.. అన్నీకలిపి ఒక బకెట్‌లో వేసుకుని ఒళ్లో పెట్టుకుంటే అదే `బకెట్‌ లిస్ట్` అని తెలిపారు. అందరం `బకెట్‌ లిస్ట్` ని పెట్టుకోవాలని, వాటిలో ఒక్కొక్కటి అఛీవ్‌ చేసుకుంటూ వెళ్లాలని తెలిపారు. మీరు థ్రిల్‌ సీకర్‌ అయితే మీ బకెట్‌ లిస్ట్ లో బంగీ జంపింగ్‌ , సర్ఫింగ్‌, స్కై డ్రైవింగ్‌ వంటివి ఉంటాయి. అదే మీరు అడ్వెంచరస్‌ కాకపోతే ఎక్కువగా ట్రావెల్‌ రిలేటెడ్‌ ఉంటాయన్నారు. చచ్చేలోపు ఎలాగైనా చేయాల్సినవి కొన్ని ఐడియాలు చెబుతున్నా అంటూ అనేక విషయాలను పంచుకున్నారు. 

`అలస్కాలో హస్కీ డాగ్స్ స్లెడ్‌ డాగ్‌ రేస్‌ ఉంది. లెవెన్‌ హండ్రెడ్‌ మైల్స్ జర్నీ. అంత కాకపోయినా లెవన్‌ మైల్స్ చేసినా చాలు. పలావ్‌ అనే చిన్న దీవి ఉంది. ఈ దేశంలో జనాభా మొత్తం పదిహేను వేలే. అక్కడ మిలియన్స్ ఆఫ్‌ జల్లీ ఫిష్‌తో స్కూబా డైవింగ్‌ ఉంటుందని..  ఉగాండా అడవుల్లో గొరిల్లాతో ట్రెకింగ్‌ బాగుంటుందని, ఆ గొరిల్లాలు మనతో కలిసి పరిగెడుతుంటాయని తెలిపారు. స్వీడెన్‌ ఐస్‌ రూమ్స్ ఉంటాయి. అక్కడకి వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకోవడమేనని అన్నారు. 

వీటితోపాటు పెరూ లో మౌంటేన్‌ ఫారెస్ట్ లో మచుపిచూ హైకి ఉంది. సముద్రం నుంచి అది మూడు వేల మీటర్ల ఎత్తులో ఉంటుందన్నారు. లండన్‌లో బకింగ్‌ జంప్‌ ప్యాలెస్‌ ముందు గార్డ్స్ డ్యూటీ ఛేంజ్‌ అవుతుంటారు. ఆ ఛేంజ్‌ అయ్యేటప్పుడు చూడాలి. సూపర్‌ ఫన్‌ అని,  రోమ్‌లో వాటికన్‌ సిటీ చూడాలని, సాయంత్రం గండలాలో తిరుగుతూ అలా ఎంజాయ్‌ చేయొచ్చని, దీంతోపాటుజపాన్‌ బిగ్‌ బుద్ధ, ఫ్యూజియన్‌లో బిగ్గెస్ట్ వల్కనం ఉందని.. 20000 ఫీట్‌ మౌంట్‌ మీదికి ఎక్కి నిల్చుంటే మజా ఉంటుందని, బీరు ప్రియులు జర్మనీలో అక్టోబర్‌ ఫెస్ట్ కి తప్పకుండా వెళ్లాలన్నారు. 

ఇంకా చైనా వాల్‌, థాయిలండ్‌లో వాటర్‌ ఫెస్టివల్‌, ఇస్గాంబుల్‌లో బ్లూ మాస్క్ ఉంది. అక్కడ కూర్చొని అజాన్‌ వినాలి. ముస్లీంలే కాదు ఇతరులు కూడా వచ్చి ఆ మ్యూజిక్‌ వింటారని, బొలివియా, గ్రీన్‌ ఐలాండ్‌లతోపాటు పారిస్‌ లాంగ్‌ కేవ్స్ లో స్క ల్స్ , నార్వే ఆకాశంలోని కలర్‌, టంజానియా, నేపాల్‌ చలిలో పేజ్‌ క్యాంప్‌కి వెళ్ళి రావడం, న్యూయార్స్ లో బ్రాడ్‌వేర్‌ మ్యూజికల్‌ నైట్‌ వంటి ప్లేస్ లు.. ఇవన్నీ మిమ్మల్ని ఊరించడానికి చెబుతున్నా` అన్నారు. 

ఇప్పటి వరకు తాను చెప్పినవన్నీ నథింగ్‌ అని.. చూడాల్సిన ప్రపంచం ఎంతో ఉందన్నారు. `మీ బకెట్‌ లిస్ట్ ని దగ్గర పెట్టుకోంది. లైఫ్‌లో కష్టపడండి. సాధించండి. వీలైతే ఇవన్నీ ఒంటరిగా తిరగండి.. ఇంతకంటే పీకేది ఏం లేద`న్నారు. పూరీ చెప్పిన మ్యూజింగ్‌లో ఇది పెద్దగా ఆకట్టుకోలేదనే టాక్‌ వినిపిస్తుంది.