ప్రియాంక చోప్రా ఖ్యాతి ఇప్పుడు అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రియాంక చోప్ర 35 ఏళ్ల వయస్సులో కూడా దుమ్మురేపే అందం, పెర్ఫామెన్స్ తో దూసుకుపోతోంది. అందాల ఆరబోతలో ప్రియాంకకు ఎవరూ సాటి రారు అనేంతగా ఘాటు ఫోటోషూట్ లతో యువత మతి చెదరగొడుతోంది. ప్రియాంక ఎంతటి అందగత్తో అంతే స్థాయిలో ఆమె చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. గతంలోనే ప్రియాంక గ్లామర్ షో పై కొన్ని వివాదాలు వచ్చాయి. వాటికి పీసీ కాస్త సుతిమెత్తగానే రిప్లై ఇచ్చింది. తాను ఎలా కనిపించినా, ఏం చేసిన తన వృత్తి కోసమే అంటూ గతంలో జవాబు ఇచ్చింది. తాజాగా ఈ భామ మరో వివాదంలో చిక్కుకుంది. అస్సాం టూరిజం కోసం ప్రియాంక చేసిన ఫోటో షూట్ తీవ్రమైన కాట్రవర్సీకి దారితీసింది. ఇప్పుడు ఈ చర్చే సర్వత్రా జరుగుతోంది.


మూడు పదుల వయసులో కూడా ఘాటైన సొగసుని మైంటైన్ చేయడం ఒక ఎత్తయితే, రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుపోవడం మరో ఎత్తు. ప్రియాంక మాజీ విశ్వసుందరి. 
ప్రియాంక టాలెంట్ కు హాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటం సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందాల ఆరబోతే కాదు రొమాంటిక్ సీన్లలో సైతం పీసీ చెలరేగిపోతోంది.ప్రియాంక చోప్రా అందాల ఆరబోతకునెటిజన్లు కుదేలైపోతున్నారు. ఘాటైన పోటోషూట్లతో పీసీ కవ్విస్తుండడంతో నిత్యం ఈ భామ ట్రెండింగ్ గా మారుతోంది.


ప్రియాంక చోప్రాకు వివాదాల్లో ఇరుక్కోవడం సైతం బాగా అలవాటు. ఆ మధ్యన భారత ప్రధాని మోడీ ముందు పొట్టి బట్టలతో కూర్చున్న ఘటన విమర్శలకు దారి తీసింది.
ప్రియాంక చోప్రా తాజాగా మరో కాంట్రవర్సీకి కారణం అయింది. అస్సాంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. బిజెపి ప్రభుత్వమే పీసీని టూరిజం కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. హద్దులు మీరుతున్న పీసీ యద అందాల వ్యవహారం అస్సాం ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారు.


అస్సాం టూరిజంకు ప్రచారం అవసరం. కానీ ఇలా ఓ మహిళ దారుణమైన గ్లామర్ షోతో వచ్చే పబ్లిసిటీ అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ప్రచారం పేరుతో అందాల ఆరబోతలో ఇంత దారుణంగా వ్యవహరించాలా అని పీసీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం టూరిజం కోసం ప్రియాంక పాటు పాడడం మంచి పనే కానీ ఈ తరహాలో కాదనేది వారి వాదన.క్లీవేజ్ షో వివాదం కొత్తగా ప్రియాంక చోప్రాతో పుట్టుకొచ్చింది కాదు. గతంలో కూడా కొంత మంది బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారంటూ నెటిజన్ల ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయి.