ప్రగతి గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ రీల్ వీడియో చేసింది. ఇందులో ఆమె ధరించిన దుస్తులు, వేసిన స్టెప్పులు చూసి.. నువ్ ఇంకా చిన్న పిల్లవి అనుకుంటున్నావా? యంగ్ అమ్మాయివి అనుకుంటున్నావా?   అంటూ ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె ఓ రేంజిలో రెస్పాన్స్ ఇచ్చింది.


స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, స్టార్ విలన్స్ ఎలాగో స్టార్ క్యారక్టర్ అని చూస్తే మొదటి ప్లేస్ లో ఉంటుంది ప్రగతి. ఆమె తెలుగులోనే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ మార్క్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 3' చిత్రంలో ప్రగతి తన నటనతో అందరినీ నవ్వించిన ఆమె మరిన్ని సినిమాలను తన కిట్టీలో వేసుకుంది.  ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'భోళా శంకర్'లో కనిపించనున్నారు ప్రగతి. ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా.. రెండిటిలో ప్రగతి రచ్చ రచ్చ చేస్తోంది.

ముఖ్యంగా  ప్రగతి చేసే వర్కవుట్లు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తుంది. అయితే అదే సమయంలో ఆమె  వేసుకునే డ్రస్ ల మీద ట్రోలింగ్ నడుస్తుంటుంది. ప్రగతి గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ రీల్ వీడియో చేసింది. ఇందులో ఆమె ధరించిన దుస్తులు, వేసిన స్టెప్పులు చూసి.. నువ్ ఇంకా చిన్న పిల్లవి అనుకుంటున్నావా? యంగ్ అమ్మాయివి అనుకుంటున్నావా? అలా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నావా? అంటూ ఇలా నానా రకాలుగా ఆమె మీద నెగెటివ్ కామెంట్లు చేశారు.

View post on Instagram
 

 దీనిపై ప్రగతి సెటైరికల్‌గానే స్పందించింది. తన మీద ట్రోలింగ్ వచ్చినా కూడా వెనక్కి తగ్గేదేలే అని చెప్తోంది. తానేమీ యంగ్‌గా కనిపించేందుకు ప్రయత్నించడం లేదని, తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నానని, ఇలా తన లైఫ్‌ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. తనను ట్రోల్ చేసేవాళ్లను  దేశోద్దారకులారా అంటూ ట్రోలర్స్‌ను సంబోధించింది.